Vastu Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల జంతువులను అలాగే మొక్కలను కూడా ఎంతో దైవ సమానంగా భావించి పూజిస్తూ ఉంటాము. ఇలాంటి వాటిలో ఏనుగులు కూడా ఒకటే ఏనుగులను మన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో శుభకరంగా పరిగణిస్తూ ఉంటాము. ఏనుగు బొమ్మలు గనక ఇంట్లో ఉంటే ఎంతో శుభం కలుగుతుందని వాస్తు పండితులు కూడా చెబుతున్నారు. అయితే ఇంట్లో వారి ఆర్థిక స్తోమతలను బట్టి ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇత్తడి ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోగా మరి కొందరు వెండి విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు.
ఇలా ఇంట్లో ఏనుగు విగ్రహాలను పెట్టుకోవడం ఇంటికి అలంకరణ మాత్రమే కాకుండా ఇంటికి ఏదో మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా అందిస్తుంది అందుకే ఇంట్లో ఏనుగుల బొమ్మలను పెట్టుకోవడం ఎంతో మంచిది ముఖ్యంగా వెండితో తయారు చేసిన ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల పలు వాస్తు దోషాలకు చెక్ పెట్టవచ్చు. వినాయకుడు ఏనుగుతో సంబంధం కలిగి ఉంటాడు. అందుకే ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉండడం ఎంతో మంచిది.
ఇంట్లో వెండి ఏనుగు పెట్టుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుందట. ఇంటి ఉత్తర దిశలో ఒక జత వెండి ఏనుగులను ఉంచితే.. పాజిటివ్ ఎనర్జీ కలగడంతో పాటు ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏనుగు విగ్రహాలు ఇంట్లో ఉండటం వల్ల మృతి వ్యాపార రంగాలలో కూడా అభివృద్ధి సాధిస్తారు పిల్లల చదువు విషయంలో కూడా ముందంజలో ఉంటారు ఇక పడక గదిలో ఏనుగు విగ్రహాలను పెట్టుకోవడం వల్ల భార్య భర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.