Solar Eclipse: ప్రతి ఏడాది అమావాస్య పౌర్ణమి లకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. మరి ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే..సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9న మధ్యాహ్నం 2:22 గంటలకు ముగుస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణం సూత కాలం 12 గంటలు లేదా 9 గంటల ముందు ప్రారంభమవుతుంది.సూత కాలం ఒక విధంగా అశుభ సమయంగా పరిగణించబడుతుంది. కనుక సూతకాల కాలంలో ఎటువంటి శుభకార్యాలూ, పూజలను చేయరు. .
మరి ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది అనే విషయానికి వస్తే కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, అరుబా, బెర్ముడా, కరేబియన్ నెదర్లాండ్స్, కొలంబియా, కోస్టా రికా, క్యూబా, డొమినికా, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది కానీ మన ఇండియాలో ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏ మాత్రం ఉండదని తెలుస్తుంది. అయితే మన ఇండియాలో సూర్య గ్రహణ ప్రభావం ఏర్పడకపోయినా తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం.
సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు అలాగే విధమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినకూడదు. వీలైనంతవరకు ఈ గ్రహణ సమయంలో మనకు ఇష్టమైనటువంటి దేవుడిని స్మరిస్తూ ఉండడం ఎంతో మంచిది. అలాగే సూర్యగ్రహణ సమయంలో గర్భిణి స్త్రీలు బయటకు రాకపోవడం చాలా మంచిది ఇలా రాకపోవడం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏ విధమైనటువంటి అనర్ధాలు ఉండవు లేదంటే సూర్యుడు నుంచి వెలబడే అతి భయంకరమైనటువంటి కిరణాలు బిడ్డ ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఈ సూర్యగ్రహణ సమయంలో పదునైన వస్తువులతో పనులు చేయటం అసలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు.