Holi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హోలీ పండుగ ఆనందంతో నిండి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఎక్కువగా మార్చి రోజులలో వస్తుంది. ఇలా హోలీ పండుగ రోజు పెద్ద ఎత్తున హోలీకా పూజ చేసిన అనంతరం దహనం నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఎంతో ఆత్రుతగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున రంగులతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఒకరిపై మరొకరు చల్లుకుంటూ గడుపుతారు.
ఇక హోలీ పండుగ రోజు కొన్ని రకాల వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహం మనపై ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. మరి హోలీ పండుగ రోజు మనం ఇంటికి ఎలాంటి వస్తువులను తెచ్చుకోవాలి అనే విషయానికి వస్తే.. జ్యోతిష శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజు మనం ఇంటికి వెదురు మొక్కను తీసుకురావటం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా ఈ మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
దీపావళి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వెండి నాణేన్ని ఇంటికి తెచ్చినట్లే.. హోలీ రోజున వెండి నాణేన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. హోలీ రోజున కుబేర యంత్రం లేదా శ్రీ యంత్రం ఉన్న లోహపు తాబేలును ఇంటికి తీసుకురండి. దీనిని ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. వీటితోపాటు హోలీ పండుగ రోజు మన ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడి ఆకులతో అలంకరణ చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాలకు పాత్రులు అవుతారు.