Betel Leaf: తమలపాకుకు ఆయుర్వేదంలోనూ అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉందనే విషయం మనకు తెలిసిందే. తమలపాకును ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఇక చాలామంది తమలపాకును భోజనం చేసిన తర్వాత తింటూ ఉంటాను ఎలా భోజనం చేసిన తర్వాత తమలపాకు తినడం వల్ల తీసుకున్నటువంటి ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తారు. కానీ భోజనం తర్వాత తమలపాకును తీసుకునేవారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
తమలపాకులో క్యాల్షియం ఐరన్ మాంగనీస్ విటమిన్ అనేక పోషకాలు కూడా ఉన్నాయి. ఈ తమలపాకు శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి మెరుగుపరచడానికి కడుపు పేగుల్లో పీహెచ్ స్థాయిలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడతాయి. ఇక మనం ఏదైనా మసాలా ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు తమలపాకులు నమలడం వల్ల ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆహారం తర్వాత పాన్ నమలడం అలవాటు చేసుకుని ఉంటారు.
ఇక కడుపునొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించడానికి తమలపాకు ఎంతగానో దోహదపడుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే తమలపాకులు తినడం వల్ల పోషకాల లోపాలు దూరం చేసుకోవచ్చు. చాతి ఊపిరితిత్తులు ఆస్తమాతో బాధపడే వారికి తమలపాకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులు తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారుకి ఉపశమనం లభిస్తుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గించే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.