Safala Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు రెండు ఏకాదశిలు వస్తాయి. అయితే కొన్ని ఏకాదశి పండుగలకు మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది అలాంటి ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి ఏకాదశిలలో సఫల ఏకాదశి ఒకటి. ఈ ఏకాదశిని పుష్యమాసంలోని కృష్ణపక్షంలో జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 జనవరి 07న వచ్చింది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మీకు పట్టిన దరిద్రం మొత్తం పారిపోతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం ఎంతో శుభప్రదం. మరి ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే..
వెండి హంస: సఫల ఏకాదశి రోజు వెండితో తయారుచేసినటువంటి హంసను మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఈ వెండి హంసను దేవుడి గదిలో పెట్టి పూజించాలి. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం బయటకు వెళ్లిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
కలశం: సఫల ఏకాదశి రోజు వెండి కలశాన్ని ఇంట్లో తెచ్చుకోవడం వల్ల మన ఇంటిపై ఏర్పడినటువంటి చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వెండితో తయారుచేసిన తాబేలు తీసుకురావడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు అందుకే సఫల ఏకాదశి రోజు ఈ వస్తువులను కొనుగోలు చేయడం ఎంతో మంచిది.