Pooja Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం దేవుడికి తప్పనిసరిగా పూజలు చేస్తూ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాము. ఇలా పూజ చేసే సమయంలో మన ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలతో చక్కగా నైవేద్యాన్ని తయారుచేసి స్వామివారికి సమర్పించి పూజ చేయడం మన సాంప్రదాయం. అయితే చాలామంది నైవేద్యం సమర్పించే సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలను నియమాలను పాటించాలో తెలియక వారికి నచ్చిన విధంగా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు కానీ స్వామి వారికి నైవేద్యం సమర్పించేటప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించడం ఎంతో అవసరం.
స్వామి వారికి నైవేద్యం సమర్పించడానికి ముందు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మన ఇంట్లో ఉన్నటువంటి తాజా పదార్థాలతోనే నైవేద్యం తయారు చేయాలి. ఎప్పుడు కూడా పాడైపోయినటువంటి ఆహార పదార్థాలతో స్వామివారికి నైవేద్యం తయారు చేయకూడదు. ఇలా నైవేద్యం తయారు చేసిన తర్వాత స్వామివారికి పూజలో నైవేద్యం సమర్పించి భోజనం పూర్తి చేసుకోవాలి. పూజ అయిన తరువాత ఆ నైవేద్యాన్ని కొంచెం తీసుకొని మనం తయారు చేసినటువంటి మిగతా ప్రసాదంలోకి వేసి ఇతరులకు పంచాలి.
ఇక నైవేద్యం సమర్పించేటప్పుడు మనం తయారు చేసిన నైవేద్యాన్ని అక్కడ పెడితే సరిపోదు నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ మంత్రాన్ని చదవటం ఎంతో ముఖ్యం. గోవింద తుభ్యమేవ్ గర్హన సుముఖో భూత్వ ప్రసిద పరమేశ్వర అనే మంత్రాన్ని చెబుతూ దేవుడికి ప్రసాదాన్ని సమర్పించాలి. ఈ విధంగా ఈ మంత్రాన్ని చదివినప్పుడే మనం దేవుడికి సమర్పించిన నైవేద్యం స్వామివారు స్వీకరిస్తారని పండితులు చెబుతున్నారు. అప్పుడే మనం చేసే పూజకు కూడా ఫలితం లభిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు.