Smart Phone: ప్రస్తుత కాలంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఎక్కువగా స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తూ కనిపిస్తుంటారు. ఒక్క క్షణం పాటు స్మార్ట్ ఫోన్ కనుక చేతిలో లేకపోతే ఏమాత్రం దిక్కు తోచదు. అందుకే పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్ చూడటంలోనే నిమగ్నమవుతున్నారు. అయితే చాలామంది రాత్రి 12 గంటల వరకు కూడా ఈ సెల్ ఫోన్స్ చూస్తూ సమయం గడుపుతుంటారు. ఇలా మీరు కనుక రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి సమయంలో మనం సోషల్ మీడియాలో వీడియోస్ చూసుకుంటూ ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటాము ఆ సమయంలో సెల్ ఫోన్ నుంచి వెలువడే నీలి కాంతి వెలబడుతుంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్‌కి ఎక్కువ గురయితే నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. మీరు ఫోన్లో ఈ-మెయిల్స్ తనిఖీ చేయడం, సోషల్ మీడియా సైట్‌లను వీక్షించడం, గేమ్స్ ఆడడం.. లాంటివి చేస్తుంటే మీ దృష్టంతా వాటిపైనే యాక్టివ్‌గా ఉంటుంది.
ఇక చాట్ చేస్తున్న సమయంలో ఏదైనా నెగిటివ్ కామెంట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని ప్రభావం పూర్తిగా మన మెదడుపై పడి అధిక ఒత్తిడికి గురవుతాము. ఇలా అధిక ఒత్తిడికి గురి కావడం వల్ల రాత్రి సమయంలో పెద్దగా నిద్ర కూడా పట్టదు. మీరు ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించినప్పుడు కళ్లు అలసిపోతాయి. మరీ ముఖ్యంగా నైట్ లైట్లు ఆఫ్ చేసి.. ఫోన్ చూస్తున్నట్టయితే.. కళ్లకు మరింత పని కల్పించిన వాళ్ళం అవుతాము అందుకే రాత్రి సమయంలో అది కూడా లైట్స్ ఆఫ్ చేసుకుని ఏమాత్రం మొబైల్ ఫోన్ చూడకూడదని ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.