Sleeping On Floor: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సుఖానికి ఇష్టపడ్డారు. దీంతో పడుకొనే విషయంలో కూడా అన్ని చాలా సౌకర్యవంతంగా ఉండేలాగే ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో వేల రూపాయలు విలువచేసే పరుపులను కొనుగోలు చేసి వాటిపై పడుకోవడానికి ప్రస్తుత కాలంలోనే వారందరూ కూడా ఇష్టపడుతున్నారు కానీ ఇలా బెడ్ పై పడుకోవడం కంటే నేలపై పడుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు మన పెద్దవారు నేలపైనే చాప వేసుకుని పడుకునే వారు కానీ ప్రస్తుతం ఎవరూ కూడా కింద కూర్చోవడానికి కూడా ఇష్టపడటం లేదు అందుకే పడుకోవడానికి కూడా ఖరీదైన పరుపులను కొనుగోలు చేసి పడుకుంటున్నారు.
ఇలా పరుపుపై పడుకోవడం కంటే నేలపై పడుకోవడం వల్లే అధిక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.మరి ఆ లాభాలు ఏంటి అనే విషయానికి వస్తే.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. దీంతో నడుము నొప్పితో పాటు వెన్నునొప్పి కూడా వస్తుంది.ఇలా వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట నేలపై పడుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. నిద్ర కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతమైనటువంటి నిద్ర కలుగుతుంది.
చాలామందికి శరీరం వేడి తత్వాన్ని కలిగి ఉంటుంది ఇలా శరీరం వేడిగా ఉన్నటువంటి వారు పరుపుపై పడుకోవడం వల్ల శరీరపు వేడి మరింత ఎక్కువవుతుంది. తద్వారా కళ్ళ నుంచి నీళ్లు కారడం ముక్కుల్లో గాయాలు ఏర్పడటం వంటివి తలెత్తుతూ ఉంటాయి. ఇక నేలపై పడుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు మొదట్లో నేల మీద పడుకోడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న అలవాటైతే నేలపై పడుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.