Thulasi Plant: మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి కోటకు పూజించడం సాంప్రదాయంగా భావిస్తూ ఉంటాము ఇలా తులసి కోటను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ దీపారాధన చేస్తుంటారు. ఇలా తులసి కోటకు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో తులసి కోట మనకు దర్శనమిస్తూ ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీటిని పోసి దీపారాధన చేసి పూజ చేస్తారు అలాగే సాయంత్రం సమయంలో కూడా చాలా మంది తులసి కోటకు పూజిస్తూ ఉంటారు అయితే సంధ్యా సమయంలో మాత్రం తులసి కోటకు నీటిని పోసి పూజించకూడదని పండితులు చెబుతున్నారు. సంధ్యా సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి తులసి చెట్టు కింద ఆసీనులై ఉంటారని అందుకే నీటిని పోయకూడదని పండితులు తెలియజేస్తున్నారు.
ఇక ప్రతిరోజు ఉదయం లేవగానే తులసి మొక్కను చూడటం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఉదయం లేవగానే తులసి కోటను చూడటం వల్ల ముల్లోకాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను చూసిన పుణ్యఫలం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి మొక్కను ఎట్టి పరిస్థితులలోను ఏకాదశి పౌర్ణమి పాడ్యమి మంగళ, ఆదివారాలలో తుంచకూడదు. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.