Alcohol: చాలామంది మద్యం ప్రియులు తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు కానీ చాలామంది అఫీషియల్ గా ఏదైనా పార్టీలకు వెళ్లినప్పుడు కొన్ని సందర్భాలలో మాత్రమే తాగుతూ ఉంటారు కానీ ఇలా మందు తాగేవారు ఎప్పుడు మందు తాగినా కూడా మందుతో పాటు మంచింగ్ కోసం కొన్ని ఆహార పదార్థాలను తింటూ ఉంటారు అయితే మందుతో పాటు ఈ క్రింది తెలిపినటువంటి ఆహార పదార్థాలను కనుక మీరు తింటూ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ప్రమాదంలో పడుతున్నారని అర్థం మరి మందుతో పాటు ఏ పదార్థాలను తీసుకోకూడదు అనే విషయానికి వస్తే…
మద్యం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ చాలామంది మద్యం సేవిస్తూ ఉంటారు ఇలా మద్యంతో పాటు సోడా కలుపుకొని పెద్ద ఎత్తున మద్యం తాగుతూ ఉంటారు ఇలా సోడా కలుపుకొని తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరమైన చెప్పాలి. ఇలా మద్యం తీసుకోవడం వల్ల మన శరీరంలో కార్బన్డయాక్సైడ్ పెరిగిపోతాయి తద్వారా అవయవాల పని తీరు కూడా తగ్గిపోతుంది. ఒకవైపు మద్యం తీసుకుంటూనే మరోవైపు శీతల పానీయాలను కూడా తీసుకుంటూ ఉంటారు.
ఈ విధంగా శీతల పానీయాలను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో హానికరం మద్యంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ప్రభావం పూర్తిగా మన ఆరోగ్యం పై పడుతుందని ముఖ్యంగా ఎముకలు పూర్తిస్థాయిలో అనారోగ్యానికి గురి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మద్యం తాగేటప్పుడు ఈ విధమైనటువంటి శీతల పానీయాలను తీసుకోకూడదు. అదేవిధంగా మద్యం సేవించడం కూడా ఆరోగ్యానికి హానికరం కనుక పూర్తిగా మద్యం మానేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.