Headache: ప్రస్తుత కాలంలో చాలామంది బాధపడుతున్నటువంటి సమస్యలలో తలనొప్పి సమస్య ఒకటి. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక పని ఒత్తిడి కారణంగా డిప్రెషన్ వల్ల కూడా తరచూ తలనొప్పి సమస్య బాధపడుతూ ఉంటారు.అయితే ఇలా తలనొప్పితో బాధపడేవారు తక్షణమే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే తమలపాకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. తమలపాకును ఏ విధంగా ఉపయోగిస్తే తలనొప్పి తగ్గుతుంది అనే విషయానికి వస్తే…
తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడేవారు నాలుగు లేత తమలపాకులను తీసుకొని వాటిని మెత్తని మిశ్రమంలో తయారుచేసి తలపై వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల తొందరగా తలనొప్పి నుంచి బయటపడవచ్చు. తమలపాకులో ఉన్నటువంటి విటమిన్లు, ఔషధ గుణాలు తొందరగా తలనొప్పి నుంచి ఉపశమనం కలగడానికి దోహదపడతాయి. ఇలా తమలపాకుతో కేవలం తలనొప్పి సమస్య మాత్రమే కాకుండా ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
మన శరీరంపై ఏవైనా గాయాలు తగిలిన వెంటనే గాయాలు మానిపోవాలి అంటే తమలపాకులు ఎంతో దోహదపడతాయి. గాయం తొందరగా మానిపోవాలి అంటే లేక తమలపాకును తీసుకొని దానికి కాస్త నెయ్యి రాసి గాయంపై పెట్టి కట్టు కట్టడం వల్ల తొందరగా ఉపశమనం పొందవచ్చు. వాతం వంటి సమస్యలతో బాధపడేవారు తమలపాకు రసం రెండు చుక్కల ముక్కులో వేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు అలాగే తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడేవారు తమలపాకు రసంలోకి మిరియాలు దంచి తీసుకోవటం వల్ల తొందరగా జ్వరం కూడా తగ్గిపోతుంది.