Coconut Water: కొబ్బరి నీళ్లు ఎంతో శ్రేష్టం ఆరోగ్యకరమైన విషయం మనకు తెలిసిందే. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను కనుక తాగటం వల్ల వారికి కాస్త శక్తి రావడమే కాకుండా తొందరగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఈ కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ప్రయోజనం కదా అని చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు కూడా ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే తాగాలని అలాగే కొన్ని వ్యాధులతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరినీరు మన శరీరం డిహైడ్రేషన్ కి కాకుండా కాపాడుతుంది అలాగే మన శరీరం ఎంతో తేమ శాతాన్ని కలిగి ఉండడానికి అలాగే మన బాడీకి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇక కొబ్బరి నీళ్లను చాలామంది రోజులో వారికి కుదిరినప్పుడు తాగుతుంటారు. అయితే సాయంత్రం కంటే ఈ కొబ్బరి నీళ్లను ఉదయం తాగటం ఎంతో మంచిది. ప్రతిరోజు అల్పాహారం తర్వాత ఒక అరగంట గంట ఆగి కొబ్బరి నీళ్ళు తాగటం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగాల్సిన పనిలేదు.
ఇక కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్ళకు దూరంగా ఉండాలి ముఖ్యంగా రక్తంలో పొటాషియం శాతం అధికంగా ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకూడదు. అలాగే కిడ్నీ వ్యాధులతో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా కొబ్బరి నీళ్లను తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు తాగటం వల్ల సమస్య మరింత అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకే ఈ సమస్యలతో బాధపడుతూ మందులు ఉపయోగించేవారు కొబ్బరి నీళ్ళను దూరం పెట్టడం ఎంతో మంచిది.