TDP-JANASENA : సినీ నటుడు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ తాజాగా పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. రాబోయో ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో అధికారికంగా వెల్లడించారు. అన్నీ ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ రోజు నుంచీ ఇప్పటి వరకూ టీడీపీ-జనసేన కార్యకర్తలు, నాయకులు కలిసి చంద్రబాబు అరెస్ట్ కి నిరసనలు తెలుపుతున్నారు. రాస్తారోకోలు, బంద్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రి జైల్లో తన భర్తను కలిసి ఆ తర్వాత మీడియా సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఇదే నేపథ్యంలో తాజాగా లోకేష్, బాలకృష్ణలతో కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిశారు.
TDP-JANASENA : ఇంకా జగన్ పాలా కేవలం 6 నెలలు మాత్రమే
ఆ తర్వాత ఆయన జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇంకా జగన్ పాలా కేవలం 6 నెలలు మాత్రమే అన్నారు. జగన్ అరాచక పాలన అంతం చేయటమే లక్ష్యమని అందుకే రాబోయే ఎన్నికల్లో టీడీపి, జనసేన కలిసి పోటీ చేయబోతున్నామని తెలిపారు. దీనిపై రాజకీయ వర్గాలలో ముఖ్యంగా టీడీపి, జనసేన నాయకుల్లో, కార్యకర్తల్లో అంతులేని ఉత్సాహం రేకెత్తింది. అయితే, ఇలా టీడీపి, జనసేన కలిసి పోటీ చేయడం వైసీపీ ప్రభుత్వానికే కలిసి వస్తుందనీ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో అధికారం ఎవరు చేపడతారో.