Red Okra: సాధారణంగా మనం మార్కెట్లో పచ్చ బెండకాయలను చూసి ఉంటాము కానీ ఎప్పుడూ కూడా ఎర్ర బెండకాయలను చూసి ఉండము ఎర్ర బెండకాయలు చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి. ఇలా ఎర్ర బెండకాయలు మార్కెట్లో ఎక్కడైనా కనపడితే వెంటనే వాటిని కొనేసేయండి ఎందుకంటే పచ్చ బెండకాయలతో పోలిస్తే ఎర్ర బెండకాయలలో ఎక్కువ పోషక విలువలు దాగి ఉంటాయి. అందుకే ఎర్ర బెండకాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఎర్ర బెండకాయలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..
ఎర్ర బెండకాయలలో అధిక పోషక విలువలు ఉండటం వల్ల ఇవి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందింపచేస్తాయి బెండకాయలను తినేవారిలో షుగర్ లెవెల్స్ పూర్తిగా నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండెపోటు సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎర్ర బెండకాయ తింటే మలబద్ధకం సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.
ఇకపోతే ఈ బెండకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తవు. దీనిలో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎర్ర బెండకాయలను తినడం వల్ల బిడ్డ ఎదుగుదలకు వారి ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది. అందుకే ఎర్ర బెండకాయలు కనపడితే వీటికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ఉత్తమం.