Curd Benefits: మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా పెరుగును ఉపయోగిస్తూ ఉంటాము పెరుగును తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే. అయితే పెరుగును పరగడుపున తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. మరి పెరుగును పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
ముందుగా ఒక గిన్నెలో మూడు స్పూన్ల పెరుగు వేసుకొని అందులోకి అర టీ స్పూన్ బ్రౌన్ షుగర్ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పెరుగును పరిగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఇలా పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది. మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ కడుపు ఉబ్బరం బట్టి సమస్యల నుంచి ఈ పెరుగు మనకు విముక్తి కలిగిస్తుంది.
Curd Benefits:
పెరుగులో బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది తద్వారా ఎలాంటి అంటువ్యాధులు మనకు సంక్రమించకుండా ఉంటాయి. ఇక పరగడుపున ఈ పెరుగు తీసుకోవడం వల్ల రోజంతా చాలా యాక్టివ్ గా ఎనర్జీగా ఉండేలా దోహదపడుతుంది. ఇక డిహైడ్రేషన్ బారిన పడకుండా ఈ పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇలా పర గడుపున పెరుగు తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటిని మన సొంతం చేసుకోవచ్చు.