Gorintaku: మహిళలకు గోరింటాకు అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన ఈ గోరింటాకు కోసమే ప్రత్యేకంగా ఒక వేడుక జరిపి అందరూ గోరింటాకు పెట్టుకొని ఎంతో సంబరంగా వేడుక జరుపుకుంటారు.ఇక ఆషాడ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క ఆడపిల్ల చేతిలో నిండా గోరింటాకు పెట్టుకొని మహాలక్ష్మిలా కనిపిస్తుంటారు. ఇకపోతే గోరింటాకు శుక్రవారం పూట కనుక పెట్టుకున్నట్లైతే సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భావిస్తారు. అలాగే ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారో అలాంటి వారు చాలా ఆనందంగా కూడా ఉంటారని తెలుస్తోంది.అయితే గోరింటాకు ఈ వరాలన్నింటిని కూడా సాక్షాత్తు సీతమ్మ తల్లి ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి.
పురాణాల ప్రకారం అరణ్యవాసం చేస్తున్నటువంటి సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకలో అశోక వనంలో బంధించిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో సీతాదేవి తన కష్టాలన్నింటిని అక్కడే ఉన్నటువంటి గోరింటాకు చెట్టుకు చెప్పుకున్నారట. అయితే రావణ సంహారం జరిగిన తర్వాత సీతాదేవి తిరిగి అయోధ్యకు వెళుతున్న సమయంలో తన బాధను మొత్తం విన్నటువంటి గోరింటాకు చెట్టుకు ఏదైనా వరం ఇవ్వాలని కోరుకున్నారట.
Gorintaku:
ఏదైనా వరం కోరుకొమ్మని చెప్పడంతో గోరింటాకు చెట్టు ప్రస్తుతం నీ మొహంలో ఎలాంటి సంతోషమైతే ఉందో లోకంలోని మహిళలందరి మొహంలో కూడా ఇదే సంతోష ఉండాలని కోరుకున్నారట. ఇలా ఎలాంటి స్వార్థం లేకుండా గోరింటాకు చెట్టు కోరిక కోరుకోవడంతో సీతాదేవి సంతోషించి ఏ మహిళ అయితే గోరింటాకు చెట్టుకు పూజ చేసి గోరింటాకు పెట్టుకుంటారు అలాంటివారు ఎల్లప్పుడు సంతోషంగా ఉంటారని అలాగే వారికే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందని వరం ప్రసాదించాలని పురాణాలు చెబుతున్నాయి.