Vastu Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ ఇబ్బందులు అన్నిటికీ కారణం ఆర్థిక సమస్యలు అని చెప్పాలి.మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మన ఇంట్లో వాస్తు సరిగా లేకపోవడం వల్ల లేదా కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఇంట్లో అమర్చకపోయిన ఆ ప్రభావం ఇంటి కుటుంబ సభ్యులపై పడుతుంది. దీనితో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలకు గురికావడం ఇతరత సమస్యలతో బాధపడటం జరుగుతుంది. ఇలాంటి సమస్యల కారణంగా డబ్బు మొత్తం ఖర్చు అవ్వడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మన ఇంట్లో అలంకరించుకొని వస్తువులను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకోవడం ఎంతో మంచిది. ఈ క్రమంలోనే మన ఇంట్లో అద్దం కూడా సరైన దిశలో పెట్టుకోవడం ఎంతో అవసరం ఇలా ఇంట్లో అద్దం సరైన దిశలో ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మరి ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలి ఏంటి అనే విషయానికి వస్తే…మన ఇంట్లో అద్దం ఎల్లప్పుడూ కూడా బయటనుంచి వచ్చే వెలుగు ఇంట్లో ప్రసారమయ్యే విధంగా ఉండాలి.
Vastu Tips:
ఇంట్లోకి అడుగుపెట్టగానే అద్దం కనిపించేలా ఎప్పుడు పెట్టకూడదు.ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ అలాగే తిరిగి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇంట్లో హాల్లో అద్దం అమర్చడం వల్ల వచ్చిన వారి చూపు మన ఇంటిపై పడకుండా అద్దంపై పడటంతో ఇంటిలో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఏర్పడకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇక మనం అద్దం అమర్చినప్పుడు ఆ అద్దంలో పొరపాటున కూడా చెత్త కనిపించేలా అమర్చకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఇక డైనింగ్ టేబుల్ ఎదురుగా కూడా అద్దం ఉండటం వాస్తు ప్రకారం మంచిది. ఇక పడక గదిలో మన బెడ్ కనిపించేలా అద్దం అమర్చకూడదు.ఇలాంటి ప్రదేశాలలో అద్దం లేకుండా చూసుకున్నప్పుడు మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.