Thu. Jul 10th, 2025

    Tulasi Plant: చాలామందికి ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతుంటాయి అయితే అన్ని సమస్యలకు కారణం ఆర్థిక సమస్యలు అని చెప్పాలి. ఇలా చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యల నుంచి బయటపడటం కోసం చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే గురువారం తులసి మొక్కకు ఈ విధంగా పూజ చేస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయనీ నిపుణులు చెబుతున్నారు. మరి గురువారం తులసి మొక్కకు ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే…

    గురువారం ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు పూజించాలి తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని భావిస్తారు. ఇక తులసి మొక్కను పూజించడం వల్ల ఆ విష్ణు దేవుని అనుగ్రహం కూడా మన పైన ఉంటుంది. ఇక తులసి మొక్కకు గురువారం ఎలా పూజ చేయాలి ఏంటి అనే విషయానికి వస్తే…గురువారం తలంటూ స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఇలా ఈ దుస్తులను ధరించి తులసి మొక్కకు భక్తుశ్రద్ధలతో పూజ చేసి తులసి మొక్కకు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి.

    Tulasi Plant:

    ఇలా ఉదయం పూజ చేసి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి అలాగే సాయంత్రం నెయ్యితో దీపారాధన చేయాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుదేవుడి అనుగ్రహం కూడా మన పైనే ఉంటుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక గురువారం రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం కూడా శుభపరిణామంగానే భావిస్తారు.ఇక గురువారం అరటి మొక్కలకు నీటిని సమర్పించడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.