News: చాలా మంది ప్రజలు తమ గమ్యానికి చేరుకోవడానికి రైల్వే మార్గాన్ని అనుసరిస్తుంటారు. టికెట్టు కాస్త తక్కువగా ఉండడం, సురక్షితంగా తమ గమ్య స్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండటంతో రైల్వే ప్రయాణానికి చాలామంది మొగ్గు చూపుతారు. టిక్కెట్టు ధర తక్కువ గా ఉన్న ప్లాట్ ఫామ్ పై ఏమైనా కొనాలి అంటే సామాన్యుడికి జోబు చిల్లవాల్సిందే. మార్కెట్లో ఉన్న ధరలకు రైల్వే స్టేషన్లలో పలికే ధరలకు అసలు పొంతనే ఉండదు. వాటర్ బాటిల్ లను కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతుంటారు. ఇది కొత్త విషయం ఏం కాదు. కానీ ఎవరికో బాగా కాలి ఈ భాగోతాన్ని బహిర్గతం చేశాడు. రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్లపై దోపిడీ అంటూ ఏకంగా ట్విట్టర్లో మోత మోగించాడు. ఈ ట్వీట్ కు అధికారులే కదిలి సదరు వ్యాపారి కి జరిమానా విధించారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) టీ స్టాల్ యజమానిపై సెంట్రల్ రైల్వే అధికారులు రూ. 50,000 జరిమానా విధించారు. లీటర్ వాటర్ బాటిల్ కు ఎక్కువ ఛార్జ్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఆర్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు వెండర్ ఐడి కార్డు చూపించడంలో స్టాల్ యజమాని విఫలం కావడంతో అతనికి జరిమానా విధించారు.
ఏదైనా ఇష్యూ జరిగితే దానిపై స్పందించడం కాదని, అధికారులు అప్రమత్తంగా ఉండి సామాన్యులను దోచుకునే ఇలాంటి వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.