Health care: పండ్లు కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం మనకు తెలిసిందే. వివిధ రకాల కూరగాయలలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉంటాయి కనుక కూరగాయలను తరచు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఇక వంకాయలో కూడా అదే స్థాయిలో పోషక విలువలు దాగి ఉన్నాయి. అయితే ఈ వంకాయతో మనం ఎన్నో రకాల వెరైటీలను తయారు చేసుకొని తింటూ ఉంటాము. వంకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ కొంతమంది మాత్రం వంకాయ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరి ఎలాంటి వారు వంకాయ తినకూడదనే విషయానికి వస్తే.. ఎవరైతే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు వంకాయను అసలు తినకూడదు. వంకాయను కనుక తింటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వంకాయ గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను మరింత పెంచుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు కూడా వంకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే వంకాయలో ఉండే కొన్ని మూలకాలు మన శరీరంలో ఇనుము శోషణను తగ్గిస్తాయి.
ఇలా మన శరీరంలో ఉన్న ఐరన్ శోషణకు గురి అయితే హిమోగ్లోబిన్ స్థాయిలు మరింత తగ్గిపోతాయి కనుక రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీలైనంత వరకు వంకాయకు దూరంగా ఉండటం మంచిది.కొంతమందికి వంకాయ అలెర్జీ ఉంటుంది. వంకాయలో ఉండే ‘సోలనిన్’ అనే మూలకం అలెర్జీకి కారణమవుతుంది. అందుకే వంకాయను తింటే కొంతమందికి చర్మంపై దురద, ముఖం లేదా గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కడుపునొప్పి సమస్య వంటివి తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు వంకాయలు తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.