Categories: LatestNews

Technology: 5జీ సేవల తర్వాత 4జీ స్మార్ట్ ఫోన్స్ పరిస్థితి ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే…?

Technology: అక్టోబర్ లో భారత్ లోకి 5జీ ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధాని మోడీ చాలా గ్రాండ్ గా ఈ 5జీ సేవలని ప్రారంభించబోతున్నారు. జియో మొదటిగా ఈ 5జీ సేవలని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. ఈ 5జీ సేవల ద్వారా మొబైల్ ఇంటర్ నెట్ సేవలలో 10 రేట్లు వేగం ఉంటుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, బ్రిటన్ లలో నడుస్తున్నాయి.

ఇప్పుడు ఇండియాలోకి ఈ 5జీ సేవలు ప్రవేశించబోతున్నాయి. ఇంటర్ నెట్ యూజర్స్ కి ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి. అయితే ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ మొబైల్ డివైజ్ లని అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఎక్కువగా 5జీ సేవలలోకి మారడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపధ్యంలో అందుకు తగ్గట్లుగానే మొబైల్ ఉత్పత్తులని మార్కెట్ లోకి తీసుకొని రావాలి.

స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పటికే ఈ 5జీ సర్వీస్ మొబైల్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ఇక పూర్తి స్థాయిలో ఇంటర్ నెట్ టెక్నాలజీ 5జీలోకి వస్తే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 4జీ స్మార్ట్ ఫోన్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వీటిని త్వరగా వదిలించుకోవడానికి కంపెనీలు కూడా రెడీ అవుతాయి. ఈ నేపధ్యంలో 5జీ మొబైల్స్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. టెక్ మార్కెట్ ని స్టడీ చేసే నిపుణులు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నారు.

కంపెనీలు మార్కెట్ లో ఉన్న తమ 4జీ స్మార్ట్ ఫోన్స్ ని వీలైనంత వేగంగా సేల్స్ చేసి 5జీ మీద ఫోకస్ పెట్టె అవకాశం ఉంటుందని, ఈ నేపధ్యంలో ధరల్ని తగ్గించడంతో పాటు, భారీ ఆఫర్స్ ని కూడా ప్రకటించే అవకాశం ఉందని సైబర్‌ మీడియా రీసెర్చ్‌లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు అమిత్ శర్మ అంటున్నారు. స్టాక్ కి వేగంగా క్లియర్ చేయడంపై కంపెనీలు దృష్టి పెడతాయని అంటున్నారు. అయితే 5జీ పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రావాలంటే కనీసం ఏడాది సమయం అయినా పడుతుందని అంత వరకు 4జీ మొబైల్స్ ధరల తగ్గే అవకాశం ఉండకపోవచ్చని మరో టెక్ నిపుణులు ఫైసల్ కవూసా అంటున్నారు.

ఇవి కూడా ఆల్టర్ నేటివ్ గా మార్కెట్ లో ఉంటాయని అంటున్నారు. 5జీ టెక్నాలజీకి సంబంధించి టవర్స్ ఇన్స్టలేషన్ పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా ఒకేసారి చేయడం లేదు. ముందుగా 13 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే లలో ఈ సేవలని మొదటి దశలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతాలలో టవర్స్ ని రియలన్స్ అభివృద్ధి చేస్తుంది.

ఈ నగరాలలో సక్సెస్ అయిన తర్వాత రెండో దశలో భాగంగా చిన్న పట్టణాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే దేశ వ్యాప్తంగా ఈ 5జీ విస్తరించడానికి కనీసం రెండేళ్ళకి పైగా పడుతుంది. అంత వరకు మార్కెట్ లో4జీ మొబైల్స్ కి వచ్చే నష్టం ఏమీ ఉండదని, సేల్స్ తగ్గే అవకాశం ఉండొచ్చేమో కాని పూర్తిగా ధరలు పతనం అయిపోవడం అంటూ జరగదని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ 5జీ సేవలు వచ్చే నెల నుంచి సరికొత్త మార్పులని తీసుకోస్తాయని మాత్రం చెప్పొచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

7 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.