Wed. Jan 21st, 2026

    YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ బలమైన రాజకీయ వ్యూహాలతో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే మరల తమని అధికారంలోకి తీసుకు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇక జగన్ సూచించిన మార్గంలోనే నాయకులు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం నిర్దేశించిన విధంగానే  మార్గంలోనే ప్రతిపక్షాలపై మాటలతో దాడి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే భౌతిక దాడులకి కూడా తెగబడుతూ అసలు ప్రతిపక్షాలకి ఓట్లు వేయకుండా ప్రజలని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది కొంత మంది ఆరోపణ.

    వాలంటీర్లే నా సైన్యం - నాడు మాట ఇచ్చాను, చేస్తాను : సీఎం జగన్..!! | AP CM YS Jagan: My confidence is volunteers, All promises made will be fulfilled - Telugu Oneindia

    అయితే వైసీపీకి గ్రౌండ్ లెవల్ లో సర్పంచ్ ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. దీనికి కారణం కూడా ఉంది. పంచాయితీ రాజ్ నిందులని వైసీపీ ప్రభుత్వ పథకాలకి వాడుకుంటుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ లో కూడా అంత సంతృప్తికరంగా లేరు. అయితే వైసీపీకి గ్రామీణ స్థాయిలో ఉండే పెద్ద బలం వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 ఉల్లకి ఒక వాలంటీర్ ని నియమించడం ద్వారా జగన్ పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరందరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపీ పార్టీ కోసం పని చేస్తున్నారు.

    Andhra CM Jagan Reddy launches volunteer system for effective delivery of schemes- The New Indian Express

    ఇక ఎన్నికల ముందు వారిని ఉత్తమ వాలంటీర్ గా జిల్లాల వారీగా గుర్తించి వారికి క్యాష్ ప్రైజ్ ఇచ్చి గౌరవిస్తోంది. తద్వారా వాలంటీర్ల ద్వారా గ్రౌండ్ లెవల్ లో సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయించి ఓటుబ్యాంకు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తోంది. తాజాగా విజయవాడలో జరిగిన వాలంటీర్లకి వందనం కార్యక్రమం ద్వారా వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు పోతాయని జగన్ నేరుగానే చెప్పారు. అందుకే వైసీపీకి తనకి సైన్యంగా అందరూ పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో మీరే వైసీపీ లీడర్లు అంటూ కొత్తగా మరో భరోసా జగన్ ఇచ్చారు.