YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తన రాజకీయ వ్యూహాలని బలంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితిలో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ నిశ్చయంతో ఉన్నారు. ఎవరు పార్టీని వీడిన పోయేదేమీ లేదనే విధంగా అగ్రెసివ్ గా పోలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ బూతులు, విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తద్వారా జనంలో వైసీపీ స్వరం బలంగా వినబడుతుందని వైసీపీ అధ్గిస్తానం నమ్మకం. 2019 ఎన్నికలలో ప్రతిపక్షాలపై వాడిన స్ట్రాటజీని మళ్ళీ ఉపయోగించి లబ్ది పొందాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఐప్యాక్ నివేదిక ఆధారంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలని జగన్ మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ మీద విమర్శలతో దాడి చేయడం అనే మాట వినిపిస్తోంది. అయితే ఈ విమర్శలు వైసీపీకి ప్రతికూలంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత అశ్వినీదత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఉత్తమ రౌడీలు, ఉత్తమ గుండాల అవార్డులని ఇస్తారు అంటూ వైసీపీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. వెంటనే వైసీపీ అధిష్టానం అతనిపై పోసాని కృష్ణమురళిని విడిచిపెట్టింది.
ఇండస్ట్రీలో వైసీపే సపోర్టర్ గా ఉంటూ ఎవరి మీద అయిన విమర్శలు చేయగల వ్యక్తి అతనే కావడంతో అధిష్టానం స్క్రిప్ట్ పంపించింది. ఇక పోసాని కూడా తగ్గేది లే అన్నట్లు తనకి పదవి ఇచ్చిన జగన్ కి కృతజ్ఞతగా అశ్వినీదత్ పై విమర్శలతో రెచ్చిపోయాయి. లోఫర్, డాఫర్, వెన్నుపోటుదారుడు పేరుతో ఆవార్డులు ఇవ్వాలంటూ విమర్శలు చేశారు. జగన్ ఎవరిని మోసం చేయలేదని, అలా చేసారని నిరూపిస్తే కళ్ళు పట్టుకుంటా అని అన్నారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా తన మీద విమర్శలు చేస్తే మరల వారితోనే ఎదుటివారిపై దాడి చేయించడం ద్వారా ఇండస్ట్రీలో కూడా జగన్ రాజకీయం స్టార్ట్ చేసారనే మాట వినిపిస్తోంది.