YSRCP: అధికార పార్టీ వైసీపీ తాజాగా నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ కి క్రాస్ ఓటింగ్ చేశారని ఆ నలుగురిపై వేటు వేశారు. ఈ నలుగురుని సస్పెండ్ చేయడం ద్వారా ఎంతగా పార్టీకి విధేయులుగా పనిచేసిన వారైనా లైన్ దాటితే వేటు తప్పదు అనే సంకేతాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేల వరకు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వినిపిస్తుంది. మరి ఆ 60 మందిని కూడా పార్టీ నుంచి జగన్ రెడ్డి సస్పెండ్ చేస్తాడా అంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న కోటంరెడ్డి గతంలోనే తనలాంటి వారు పార్టీలో ఇంకా చాలా మంది ఉన్నారని వ్యాఖ్యలు చేశారు.ఇక తాజాగా సస్పెండ్ కి గురైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీలో మరో 50 మంది అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని వారిని కూడా సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష టీడీపీ కూడా వైసీపీ నుంచి తమ పార్టీలోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని కామెంట్స్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకి జగన్ రెడ్డి పాలన నచ్చడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, జగన్ పాలనపై ప్రజలలో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందని కామెంట్స్ చేశారు.
టీడీపీ అన్ స్టాపబుల్ షో మొదలు కాబోతుందని అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ పోవడమే లక్ష్యంగా బలమైన వ్యూహాలతో ప్రజలలోకి వెళ్తామని అన్నారు. ఇక రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఎన్నికల ముంది వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్న వారు చాలా మంది ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు నుంచి హామీ వస్తే వారు వైసీపీకి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారు. ఇక టీడీపీ నాయకులూ కూడా ఇదే మాట చెబుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. మరి రానున్న రోజులలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఎలా మారుతాయి అనేది చూడాలి.