YS Jagan: ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ వైసిపి వచ్చే ఎన్నికలలో కూడా వివేకంగా 175 స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యానికి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురవుతూ ఉండడం గమనార్హం. వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలతో చాలామంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ చేశారు అనే ఆరోపణలతో సస్పెండ్ చేసిన సంగతి విధితమే. అయితే బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానం పైన ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
ఆయనకి అనుకూలంగా ఉండే వారికి వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం పార్టీలో ఏకంగా 60 మందికి పైగా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని పెద్ద బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరనేది గుర్తించే పనిలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే వీరిలో టిక్కెట్టు రాదు అని నిర్ణయించుకున్న వాళ్ళు బయటకి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే వీరందరూ బయటకు రావడంతోనే వైసీపీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే ఇప్పటికే ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఓ రకమైన అసహనంతో ఉన్నారని ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేల నుంచి రానున్న రోజుల్లో కచ్చితంగా జగన్ ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తూ ఉన్న మాట.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.