Categories: LatestNewsPolitics

YS Jagan: జగన్ ను టెన్షన్ పడుతున్న అసంతృప్తులు

YS Jagan:  ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ వైసిపి వచ్చే ఎన్నికలలో కూడా వివేకంగా 175 స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యానికి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురవుతూ ఉండడం గమనార్హం. వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలతో చాలామంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ చేశారు అనే ఆరోపణలతో సస్పెండ్ చేసిన సంగతి విధితమే. అయితే బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానం పైన ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

ఆయనకి అనుకూలంగా ఉండే వారికి వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం పార్టీలో ఏకంగా 60 మందికి పైగా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని పెద్ద బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరనేది గుర్తించే పనిలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది.

 

అయితే వీరిలో టిక్కెట్టు రాదు అని నిర్ణయించుకున్న వాళ్ళు బయటకి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే వీరందరూ బయటకు రావడంతోనే వైసీపీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే ఇప్పటికే ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఓ రకమైన అసహనంతో ఉన్నారని ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేల నుంచి రానున్న రోజుల్లో కచ్చితంగా జగన్ ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తూ ఉన్న మాట.

Varalakshmi

Recent Posts

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

13 hours ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

1 day ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

2 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

4 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

4 days ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

5 days ago

This website uses cookies.