YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రజలలో ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇది ఆలస్యం అవుతున్న కొద్ది మరింత పెరుగుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎంత ఆలస్యం అయితే అంత పెద్ద ఓటమిని జగన్ రెడ్డి చూస్తారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. ఇప్పటికే గ్రౌండ్ లెవల్ లో ప్రచార కార్యక్రమాలని మొదలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్ గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గత రెండు నెలలుగా నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించి గడపగడపకి మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరు ప్రోగ్రస్ రిపోర్ట్ ని ఇచ్చినట్లు తెలుస్తుంది.
అందులో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు 30 మంది వరకు ఉన్నారని తెలుస్తుంది. వారందరి పేర్లు చదివి జగన్ అందరి ముందే వారిని హెచ్చరించడం జరిగినట్లు తెలుస్తుంది. ఇక గ్రామ సారథులని ఏర్పాటు చేసే పనిలో కూడా యాక్టివ్ గ వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో మార్చి 18 నుంచి మా భవిష్యత్తు నువ్వే జగనన్న పేరుతో క్యాంపెయిన్ చేయాలని, అలాగే ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించాలని ఎమ్మెల్యేలకి, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకి ఆదేశాలు జరీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సారథులు, వాలంటీర్లు, ఎమ్మెల్యేలు అందరూ భాగస్వామ్యం కావాలని ప్రతి గడపకి వెళ్లి సంక్షేమ పథకాలపై వారికి తెలియజేయాలని ఆదేశించారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికల ఆలోచన ఏమీ లేదని 14 నెలలు ఎన్నికలకి ఉన్న నేపధ్యంలో అందరూ ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నంలో ఉండాలని ఎమ్మెల్యేలకి జగన్ అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్యాంపెయిన్ లో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని రిపోర్ట్ వస్తే వారికి టికెట్లు ఇవ్వడం జరగదని సమీక్షలో జగన్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఈ సమావేశం ద్వారా ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఆలోచన లేదని జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.