Thu. Jan 22nd, 2026

    YS Jagan: ఏపీలో అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల అజెండా నుంచి మెల్లగా విశాఖ రాజధాని అనే భావన వైపు ప్రజలని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం అమరావతిని అసెంబ్లీ సమావేశాలకి మాత్రమే పరిమితం చేసి పరిపాలన అంతా విశాఖ నుంచి నిర్వహించాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఎన్నికలకి ముందే విశాఖకి షిఫ్ట్ అయ్యి తన రాజకీయం మొదలు పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికలకి ఆరు నెలల ముందు విశాఖకి వెళ్ళడం ద్వారా ప్రజలలో రాజధాని అనే భావనని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ విభజన వాదం తీసుకొచ్చి ఎన్నికలకి అదే నినాదంతో వెల్లాలని వైసీపీ అజెండాగా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

    CM Jagan plans more than just capital for Vizag? - TeluguBulletin.com

    దీనికోసమే జగన్ పదే పదే విశాఖ రాజధాని అని చెప్పడమే కాకుండా తాను కూడా విశాఖకి షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా భోగాపురం ఎయిర్ పోర్ట్ మరోసారి శంకుస్థాపన చేసిన జగన్ విశాఖకి తాను అతి త్వరలో షిఫ్ట్ అవుతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇదంతా జగన్ రాజకీయ ఎత్తుగడలో భాగమే అని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. పల్నాడు అమరావతి పరిసర ప్రాంతాలలో పట్టు కోల్పోతున్న నేపధ్యంలో ఉత్తరాంద్రలో బలం పెంచుకోవడానికి వైసీపీ ఆడుతున్న డ్రామాలుగా కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా విశాఖని వైసీపీ రాజధానిగా చేయలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.

    Visakhapatnam: 7 things to know about new Andhra Pradesh capital | Latest  News India - Hindustan Times

    జనసేన, టీడీపీ కలయిక జరుగుతుంది అని కన్ఫర్మ్ కావడంతో వైసీపీ ఎన్నికలలో గెలవడం కోసం తన దగ్గర ఉన్న అన్ని ఆయుధాలని ఉపయోగిస్తుంది. అందులో భాగంగానే రాజధాని చుట్టూ రాజకీయాన్ని నడుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే 2014 సీన్ రిపీట్ కాకుండా చేయడం కోసం జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళ్తున్న మరో వైపు ప్రజలలో పెరిగిపోతున్న అసహనం వైసీపీపై వ్యతిరేకతకి కారణం అవుతోంది. మరి దీనిని ఎలా జగన్ హ్యాండిల్ చేసి విశాఖ రాజధాని అనే అంశాన్ని తనకి అనుకూలమైన ఓటింగ్ గా మార్చుకుంటాడు అనేది వేచి చూడాలి.