YS Jagan:

ఏపీ రాజకీయాలలో రోజురోజుకీ సమీకరణాలు మారిపోతున్నాయి. కొత్త ఏడాదిలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో నాయకులు నుంచి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసిపి అధిష్టానం పై అసమతి స్వరం వినిపించారు. వీరిపై ముఖ్యమంత్రి జగన్ తాత్కాలికంగా పార్టీ పదవులు తొలగించి వేటు వేశారు. అయితే మరింత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీపై అసమ్మతి స్వరం వినిపించే అవకాశం ఉందని మాట వారి అంతర్గత సర్వేల ద్వారా బయటకొచ్చింది. ఇప్పటికే సర్వేలలో కూడా 105 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
ఈ నేపథ్యంలో మరింత వ్యతిరేకత పెరగకుండా ఉండాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిదని ఆలోచనలో వైసీపీ అధిష్టానంలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. నిజానికి ఎన్నికలు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అంతవరకు వేచి ఉండాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఐదేళ్ల పాలన ముగించుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నారు. అయితే సొంత పార్టీ లోనే వ్యతిరేకత పెరిగిపోవడం, క్యాడర్లోకి తప్పుడు సాంకేతాలు పంపించినట్లు అవుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రజల ఓటింగ్ పైన కూడా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారానే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఐ ప్యాక్ కూడా ముఖ్యమంత్రి జగన్ కి సూచించినట్లుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఉన్నపలంగా నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నాయకులందరికీ కూడా భరోసా ఇవ్వడంతో పాటు, రానున్న ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి. ఆలోచనలు ఏంటి అనేది చెప్పబోతున్నారు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ముందస్తు ఎన్నికలకు నాయకులు అందర్నీ కూడా సన్నద్ధం చేసే ఉద్దేశంలో ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశాన్ని నిర్వహించ బోతున్నారని అధికార పార్టీలో కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా తమ అనుకున్న 175 స్థానాల్లో గెలవడం సాధ్యమవుతుందని కూడా ఎమ్మెల్యేలు నాయకులు అందరికీ కూడా చెప్పే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే ఈ ఏడాది ద్వితీయార్థంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.