Categories: LatestNewsPolitics

YS Jagan: జగన్ కి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు… ఊహించని పరాభవం

YS Jagan: ఏపీ రాజకీయాలలో పార్టీల మధ్య వైరం రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీతో మరల అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి ఊహించని పరాభవం ఎదురయింది.  ఇదిలా ఉంటే మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏడు స్థానాలను సొంతం చేసుకొని క్లీన్ స్వీప్ చేయాలని భావించిన వైసీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేల షాక్ ఇచ్చారు.  ఏకంగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడి టిడిపి అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలవడానికి సహకరించారు. 

అసలు టిడిపి అభ్యర్థి గెలుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. చంద్రబాబు నాయుడు కేవలం ప్రతిష్టను కాపాడుకోవడానికి పంచమర్తి అనురాధను బలి పశువు చేస్తున్నాడని అందరూ విమర్శలు చేశారు. అయితే ఊహించని విధంగా జరిగిన ఎమ్మెల్సీ పోటీలలో పంచమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి.  నిజానికి టిడిపికి ప్రస్తుతం అంత బలం లేదు.  19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది.  అయితే ఇద్దరు వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు టిడిపికి మద్దతు ఇచ్చారు.  ఆ లెక్కన చూసుకున్న 21 ఓట్లు మాత్రమే తెలుగుదేశం అభ్యర్థికి రావాలి. కాని 23 ఓట్లు రావడం సంచలనంగా మారింది.  దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడి టిడిపి అభ్యర్థులు గెలిపించినట్లు నిర్ధారణ అయింది. 

ఇప్పుడు వారు ఎవరనేది వైసిపి అధిష్టానం సమీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది.  ఇక చంద్రబాబు నాయుడు డబ్బులతో వారిని కొన్నాడని వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.  తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ ఉండవల్లి శ్రీదేవి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాజరు కాలేదు.  దీంతో వారిద్దరు క్రాస్ ఓటింగ్ పాల్పడి ఉంటారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.  మరి ముఖ్యమంత్రి జగన్ వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే వైసిపి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటి ముందు ఉన్న వైసిపి ఫ్లెక్సీలను, పార్టీ కండువా కప్పుకుని ఉన్న ఫోటోలను తొలగించారు.  దీంతో ఆయన టిడిపికి మద్దతు ప్రకటించారని వైసీపీ శ్రేణులు ఒక నిర్ణయానికి వచ్చేసాయి.

Varalakshmi

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.