YS Jagan: ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు అంటే గతంలో అందరికీ ఒక టెన్షన్ ఉండేది. ఎమ్మెల్యేలు పనితీరును ర్యాంకింగ్ కట్టి మరి ఎత్తి చూపిస్తూ వ్యక్తిగతంగా అందరిని హెచ్చరిస్తూ ఉండేవారు జగన్. అలాగే పనితీరు మార్చుకోకపోతే ఎమ్మెల్యే సీటు ఇచ్చేది లేదని కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేవారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కావాలంటే తాను చెప్పిన ప్రతి పని చేయాలనే విధంగా జగన్ వ్యవహరిస్తూ ఉండేవారు. ఈ విధానం ఎమ్మెల్యేలలో ఒకంత అసంతృప్తి పెరగడానికి కారణమైంది. చిన్నపిల్లలను స్కూల్లో కూర్చోబెట్టి క్లాసులు చెప్పినట్టు తమకి రెగ్యులర్ గా జగన్ గంటలు తరబడి క్లాస్ పీకడం చాలామంది ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా జగన్ కంటే సీనియర్స్ చాలామంది వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారంతా కూడా జగన్ నియంతృత్వ విధానాలపై బైటికి చెప్పకపోయిన లోవలోపల మదన పడుతూనే ఉన్నారు.
అయితే తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలను వైసీపీ కోల్పోయింది. దాంతోపాటు అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కూడా ఒకటి కోల్పోయింది. పార్టీలోనే విధేయులుగా ఉన్నవారే క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన కారణంగానే ఇదంతా జరిగిందని జగన్ కూడా గ్రహించారు. ఇక పార్టీలో చాలామంది అసంతృప్తి ఉన్నారనే విషయం కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి జగన్ కి అర్థమైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలను బుజ్జగించి వారికి దిశ నిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ఈసారి ఎమ్మెల్యేలు అందరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఉంటుంది అని అంచనా వేసుకొని వెళ్లిన వారికి జగన్ వ్యవహారం చాలా కొత్తగా కనిపించిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ప్రతి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటా.మీరందరూ నా వాళ్ళే మీ అందరి గెలుపు కోసం తాను బటన్స్ నొక్కి ప్రజల ఖాతాలోకి డబ్బులు వేస్తున్న. మీరు ప్రజల మధ్యకు వెళ్లి మన ద్వారా అందుతున్న లబ్ది గురించి చెప్పండి. ప్రజలకు నమ్మకం కలిగించండి అప్పుడు కచ్చితంగా 175 స్థానాల్లో గెలుస్తాం అంటూ జగన్ సూచించారు. గెలుపు మనకు చాలా అవసరమని కూడా చెప్పడం విశేషం. అయితే ఒకప్పటి అతి నమ్మకం జగన్ లో ఈసారి జరిగిన సమీక్ష సమావేశంలో కనిపించలేదని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. ఎమ్మెల్యేలు అందరికీ కూడా సున్నితంగా చెప్పడంతో పాటు ఒకింత అసహనం కూడా జగన్ లో ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది.