Health Tips: ప్రస్తుత కాలంలో మనం పడుకోవాలి అంటే తప్పనిసరిగా పరుపు ఉండాల్సిందే పరుపు లేకపోతే చాలామందికి నిద్ర కూడా పట్టదు. ఎంతో సుతి మెత్తని పరుపులను కొనుగోలు చేసి ఆ పరుపుల పై నిద్రపోతూ ఉంటారు అయితే ఇలా పరుపుల పై నిద్రపోవటం వల్ల చాలామందికి వెన్నునొప్పి నడుం నొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కానీ గతంలో మన పెద్దవారు నేలపైనే పడుకోనేవారు ఇలా నేలపై పడుకోవడం వల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.
ఇక నేలపై పడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఇకపై ఎవరూ కూడా మంచం ఎక్కరని మంచాన్ని మడతపెట్టి ఓ పక్కన పెట్టేస్తారని చెప్పాలి. మరి నేలపై పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. నేలపై పడుకోవటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మన శరీరం ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిటారుగా ఉంటుంది. తద్వారా వెన్నెముక కూడా నిటారుగా ఉండడంతో ఏ విధమైనటువంటి వెన్నునొప్పి నడుము నొప్పి వంటి సమస్యలు ఉండవు.
ఇక నేల మీద పడుకోవటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. తద్వారా ఏ విధమైనటువంటి నొప్పులు లేకుండా ఉండడమే కాకుండా గుండె పనితీరు కూడా పెరుగుతుంది. అలాగే మన శరీరం ఒత్తిడి నుంచి బయటపడి మన శరీరానికి ఎంతో విశ్రాంతిని కలిగిస్తుంది సుఖమైన నిద్ర ఉండటం వల్ల మన మెదడు కూడా ప్రశాంతంగా ఉండటమే కాకుండా మరుసటి రోజు ఉదయం ఎంతో చలాకీగా నిద్రలేచి రోజు వారి పనులను చేసుకుంటాము. ఇలా నేలపై పడుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు