Yogini Ekadashi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాదశిని ఎంతో ముఖ్యమైన శుభకరమైన దినంగా భావిస్తూ ఉంటాము. ఇక ఏకాదశి రోజు శ్రీమన్నారాయణ పూజించటం వల్ల సకల సంపదలు కలుగుతాయని లక్ష్మీనారాయణ అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తూ ఉంటారు. అయితే యోగిని ఏకాదశి రోజు కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. మరి ఈ యోగిని ఏకాదశి ఏడాది ఎప్పుడు వస్తుంది ఆ రోజు ఎలాంటి వస్తువులను దానం చేయాలి అనే విషయానికి వస్తే..
పంచాంగం ప్రకారం జేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి జూలై 1 ఉదయం 10:26 గంటలకు ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి జూలై 2న ఉదయం 8:34 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం యోగిని ఏకాదశి వ్రతం 2 జూలై 2024న ఆచరిస్తారు.జ్యోతిష్య విశ్వాసం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగంలో చేసే ఏ పని అయినా విజయవంతమవుతుంది. దీనితో పాటు త్రిపుష్కర యోగ సమయంలో పూజలు, దానములు, యాగాలు లేదా మరేదైనా శుభ కార్యాలు చేయడం వల్ల మూడు రెట్లు ఫలితాలు లభిస్తాయి.
ఈ యోగిని ఏకాదశి రోజు పేదవారికి కడుపునిండా భోజనం పెట్టడం ఎంతో శుభకరమైనదిగా భావిస్తారు. ఇక అదే రోజు పేదవారికి వస్తదానం చేయటం వల్ల మనం చేసిన పాపాలు మొత్తం తొలగిపోతాయి. దేవదేవతలకు ఆహారంగా పరిగణింపబడిన నెయ్యిని దానం చేయటం వల్ల తెలివితేటలతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. నువ్వులను దానం చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక పేదవారికి బ్రాహ్మణులకు దక్షిణ దానం చేయటం మంచిది అలాగే గోదానం కూడా ఎంతో శుభకరమైనదనీ పండితులు చెబుతున్నారు.