Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’ సినిమా తెరకెక్కబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వదిలిన గ్లింప్స్‌లో దేవీశ్రీప్రసాద్ ఫస్ట్‌లుక్ చూస్తే మెంటలెక్కిపోయింది. సంగీత దర్శకుడిగా దేవికి ఉన్న పాపులారిటీ ఏపాటిదో అందరికీ తెలిసిందే. రాక్‌స్టార్ అనే టైటిల్ సాధించుకున్న ఈ మ్యూజిక్ సెన్షేషన్ పుష్ప సినిమాతో ఎలాంటి పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. ఫీల్‌గుడ్ సినిమాకి డీఎస్పీ అందించే బీజిఎం పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది.
ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన డీఎస్పి, థమన్ దూకుడుతో కాస్త స్లో అయ్యాడు. కానీ, దేవీశ్రీప్రసాద్ చేయాల్సిన సినిమాలు మాత్రం తనకే వస్తున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Devi Sri Prasad:వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా సెట్స్ మీదకి రాబోతోంది.
ఈ క్రమంలో ఇంతకాలం సంగీత దర్శకుడిగా అందరినీ అలరించిన రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఇప్పుడు నటుడిగా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా అనిపించిన ఈ గ్లింప్స్ చివరిలో దేవిశ్రీప్రసాద్ లుక్ చూస్తే ఒక్కొక్కరికీ మెంటలెక్కిపోయింది.
కాళ్లకి గజ్జెలు కట్టుకుని, ఓ పొట్టేల్ కి ఎదురుగా పరిగెత్తుతున్నట్టుగా గ్లింప్స్ స్టార్ట్ అయింది. చివరికి ఓ చెట్టు..దాని దగ్గర్లో ‘పర్శి’ పాత్రలో నటించబోతున్న దేవీ ఫస్ట్ లుక్ రివీలైంది. పొడవాటి జుట్టు..ఆ డిఫరెంట్ మేకోవర్ చూస్తే ఇందులో ‘పోతురాజు’ పాత్రను పోషిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇక, ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ పెట్టారు. కాబట్టి, ఇది గ్రామ దేవత కథ అని హింట్ గా తెలుస్తోంది. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా 5 భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇక, గతకొంతకాలంగా ‘ఎల్లమ్మ’ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలను ఇటీవల కీర్తి తోసిపుచ్చింది. ఇప్పుడు వదిలిన గ్లింప్స్ లో కూడా హీరోయిన్ ఎవరనేది వెల్లడి కాలేదు. చూడాలి, కథలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ‘ఎల్లమ్మ’ టైటిల్ పాత్రలో కనిపించే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో.

