జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తన రాజకీయ వ్యూహాలతో వైసీపీని గద్దె దించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా ఓ వైపు సోషల్ మీడియాని, మరో వైపు పబ్లిక్ మీటింగ్స్ ద్వారా వైసీపీకి చెమటలు పట్టిస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ వైఫల్యాలని, ఆ నాయకుల విధానాలని బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్తున్నారు.
తాను సిద్ధాంతపరంగా ప్రభుత్వ చేస్తున్న పనులపై విమర్శలు చేస్తే తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ప్రజలకి గట్టిగానే నమ్మిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యక్తిగత దాడి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ఎంత సేపు దత్తపుత్రుడు, ముగ్గురు పెళ్ళాలు అనే మాటలు తప్ప వైసీపీ నాయకుల దగ్గర మరింకేమీ ఉండటం లేదా అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నాయి.
ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడంతో పాటు టీడీపీతో పొత్తు సమీకరణాలకి తెరతీసిన పవన్ కళ్యాణ్ వైసీపీకి టెన్షన్ పెట్టాడు. జనసేనానిని ఎలా అయినా టీడీపీతో కలవకుండా ఆపాలనే వైసీపీ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఇద్దరూ కలిసి వచ్చిన ఎదుర్కోవడానికి జగన్ తన టీమ్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక జగన్ కూడా బయటకి వచ్చి సభలలో పాల్గొన్నప్పుడు తాను సింహంలా సింగిల్ గా వస్తూ ఉన్నా అని వారంతా గుంటనక్కల మాదిరిగా తన మీద దాడి చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాగే ఎప్పటిమాదిరిగా దత్తపుత్రుడు అంటూ అదే పల్లవి పాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గత మీటింగ్ లో మాట్లాడుతూ ఏపీలో క్యాస్ట్ వార్ నడుస్తుందని అన్నారు.
వైసీపీ కులాలని విభజించి రాజకీయం నడుపుతుందని విమర్శించారు. అయితే దీనికి కౌంటర్ గా జగన్ ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ అని పేర్కొన్నాడు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్ లతో కౌంటర్ ఇచ్చారు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారని అన్నారు. అలాగే ధనిక ముఖ్యమంత్రి పాలనలో తాను తప్ప అందరూ బానిసలే అని భావన వైసీపీలో ఉందని విమర్శించారు.
క్లాస్ వార్ కి జగన్ కొత్త నిర్వచనం చెప్పారని, ఓ వైపు పేదలపై పడి అన్ని విధాలుగా దోచుకుంటూ తాను పేదవాడిని అని చెప్పుకుంటూ ప్రజలని నమ్మించాలని అనుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ లపై వైసీపీ మళ్ళీ భుజాలు తడుముకుంటూ పవన్ ముగ్గురు పెళ్ళాలు అంటూ మంత్రి అమర్ నాథ్ విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.