AP Politics: ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలలో గెలవడానికి అధికార పార్టీ వైసీపీ అన్ని రకాల ప్రచార అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎమ్మెల్యేలకి, సమన్వయ కర్తలకి దిశానిర్దేశ్యం చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎలా ప్రజలని ఆకట్టుకోవాలి అనేది చెబుతున్నారు. నిజానికి వైసీపీ ప్రభుత్వం మీద ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఉందనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఒక సంక్షేమ పథకాల పేరుతో మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం ఒకటే చేస్తున్నారు. ఇక వీటికోసం లక్షల కోట్లు అప్పులు కూడా చేస్తున్నారు. ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపన ఎక్కడా లేదు. లక్షల కోట్ల పెట్టుబడులు అని చెబుతున్న ఎక్కడా కనిపించడం లేదు. అలాగే జాబ్ క్యాలెండర్ ఒసే లేదు.
వాలంటీర్లు, గ్రామ పంచాయితీ ఉద్యోగాలు ఇచ్చి వాటినే మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు హామీలు పూర్తిగా విస్వరించారు. కార్పోరేషన్ నిధులు, పంచాయితీ గ్రాంట్స్ ని కూడా సంక్షేమ పథకాల కోసం మళ్ళించేసారు. కార్పోరేషన్ రుణాలు కూడా ఇవ్వడం ఉపాధి కోసం ఇవ్వడం లేదు. ఇలా అన్నింటా విఫలం కావడంతో సంక్షేప పథకాల ద్వారానే అధికారంలోకి రావాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఇక ప్రభుత్వ కార్యక్రమాల కోసం నియమించిన వాలంటీర్లని ఇప్పుడు వైసీపీ ప్రచార వ్యూహంలో భాగం చేయడం విశేషం.
గ్రామ సారథులతో కలిసి వెళ్లి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల ద్వారా ఎంత లబ్ది పొందింది చెప్పాలని చెబుతున్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే పూర్తి బాద్యత వాలంటీర్లదే అని జగన్ నొక్కి మరీ చెబుతున్నారు. అయితే వాలంటీర్లని ఇలా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడంపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే 5 వేలు జీతం ఇచ్చి అడ్డమైన పనులు తమతో చేయించుకుంటున్నారు అనే అసహనం కూడా వాలంటీర్లలో ఉందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో రానున్న రోజులలో వాలంటీర్లు వైసీపీ సర్కార్ పై తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట