Wed. Jan 21st, 2026

    Yuvagalam: నారా లోకేష్ యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ మరల టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహానాడు నేపథ్యంలో ఓ నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాత్రని ప్రారంభించారు. ఇక ప్రజల నుంచి ఈ యాత్రకి రోజురోజుకి స్పందన పెరుగుతోంది. ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపించకపోయిన ఇప్పుడిప్పుడే లోకేష్ యువగళంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ యాత్ర జరుగుతున్నా నియోజకవర్గాలలో స్థానిక వైసీపీ నాయకులు, నార్యకర్తలు విపరీతంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం. తాజాగా ప్రొద్దుటూరులో ఈ యాత్ర కొనసాగుతోంది.

    nara lokesh Yuva Galam pada yatra reaches 1000 km milestone

    అయితే యాత్రని లక్ష్యంగా చేసుకొని వైసీపీ కార్యకర్తలు నారా లోకేష్ పై కోడిగుడ్లు విసిరారు. దీనిని సీరియస్ గా తీసుకొని టీడీపీ కార్యకర్తలు అందరూ అతనిపై దాడి చేశారు. అయితే ఈ ఘటనని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. యువగళం పాదయాత్రని చూసి వైసీపీ నాయకులు భరించలేకపోతున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయ వర్గాలలో కూడా ఇదే మాట వినిపిస్తోంది. టీడీపీ మహానాడులో మేనిఫెస్టోని ప్రకటించిన తర్వాత వైసీపీ నాయకులకి అసహనం ఎక్కువ అయ్యిందని అన్నారు. ఎలా అయిన భయభ్రాంతులకు గురి చేసి కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.

    Nara Lokesh suspends 'Yuva Galam Padayatra'- The New Indian Express

    ముఖ్యంగా యువగళం పాదయాత్రకి ఆదరణ పెరుగుతుందని, రానున్న రోజుల్లో మరింతగా ఏపీ రాజకీయాలలో ఈ పాదయాత్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పొత్తులకి జనసేన ఒప్పుకోవడంతో తెలుగు దేశం పార్టీ మరింత యాక్టివ్ గా తన రాజకీయ వ్యూహాలు అమలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే పొత్తులు విడగొట్టడానికి వైసీపీ మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టర్లు కూడా ప్రధాన పట్టణాలలో ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. వీటిని జనసైనికులు బలంగా ఎదుర్కొంటూ వైసీపీని లక్ష్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానిలో ఏపీలో ఎన్నికలకి ఏడాది ముందే రాజకీయ వేడి రాజుకుందని చెప్పొచ్చు.