MLC Elections: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానిక సంస్థల కోటాలో ఉన్న తొమ్మిది సీట్లను వైసీపీ సొంతం చేసుకుంది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం వైయస్ జగన్ కి ఊహించని పరాభవం ఎదురయింది అని చెప్పాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ అంటే ఓ విధంగా ఎమ్మెల్యే ఎన్నికలలో సమానం. లక్షలాది మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైయస్ జగన్ మూడేళ్ల పాలనపై వారిలో ఉన్న అభిప్రాయం ఓట్ల రూపంలో బయటకు వస్తుంది. అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలలో అధికార పార్టీ వైసిపి అభ్యర్థులు దారుణంగా ఓడిపోవడం విశేషం.
ఈ ఓటమితో ప్రభుత్వ వ్యతిరేకత పట్టబద్రులలో వైసిపి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా బయటపడినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని వైయస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే గ్రాడ్యుయేటర్స్ లో చాలావరకు ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నవారు ఉంటారు. అలాగే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్న ఉద్యోగస్తులు కూడా ఉంటారు. వీరిలో జగన్ మూడేళ్ల పాలనపై వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుంది. దీంతోపాటు పవన్ కళ్యాణ్ వైయస్ జగన్ ను గద్దె దించే దిశగా చేస్తున్న వ్యూహాత్మక ప్రచారం కూడా వైసీపీకి ప్రతికూలంగా మారింది అనే మాట వినిపిస్తుంది.
ఉత్తరాంధ్రలో అయితే కాపు సామాజిక వర్గం బలంగా వైసీపీ ఓటమికి పనిచేసినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అలాగే అయితే వైసిపి నాయకత్వం మాత్రం ప్రతిపక్షాలు కుట్రలో భాగంగా అందరి ఓట్లు కలిసి రావడంతో వారు గెలిచారని ప్రచారం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మాత్రం బలంగా పనిచేసింది అనే మాట రాజకీయ వర్గలలో వినిపిస్తుంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి ద్వారా వైఎస్ జగన్ కూడా తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.