AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరుకుంది అనే సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలలో అసహనం పెంచుతున్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం మీద రెండు పార్టీలు గొడవలు పడుతూ కొట్టుకునేంత వరకు వెళ్తున్నాయి. ప్రజా సమస్యలని వదిలేసి వ్యక్తిగత కక్ష సాదింపు చర్యలే ఎక్కువగా వైసీపీ, టీడీపీ మధ్య ఉన్నాయనే మాట వినిపిస్తుంది. తాజాగా అసెంబ్లీ వరకు రెండు పార్టీల మధ్య గొడవలు వచ్చేశాయి. ఏకంగా ఎమ్మెల్యేలు స్థాయి మరిచి అసెంబ్లీలో బాహాబాహీ గొడవ పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ ఘటనలో బాధ్యులుగా చూపిస్తూ స్పీకర్ 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు. అయితే వైసీపీ నాయకులే తమపైన భౌతిక దాడికి పాల్పడ్డారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అసెంబ్లీ సాక్షిగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఇలా కొట్టుకునేంత వరకు వెళ్ళడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్ళుగా జరుగుతున్న ఈ రాజకీయ కక్షసాదింపులు, ప్రజలలో కూడా అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తుకి అద్దం పడుతున్నాయి.
టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం రోడ్డు మీద బట్టలు ఇప్పించి అందరిని కొడతాం అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మీరు చేసిన ప్రతిదానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇవి ఒకింత అశాంతిని పెంచే విధంగానే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ వైపు ప్రజలు చూస్తున్నారు అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరల ప్రశాంతత స్థితిలోకి వస్తుందని భావిస్తున్నారు. అందుకోసమే ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తుంది. ఈ రెండు పార్టీలు గొడవపడి పవన్ కళ్యాణ్ బలాన్ని రోజు రోజుకి పెంచుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.