Wed. Jan 21st, 2026

    Womens-Saree-Fight : చీరలంటే మగువలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిండన్నా మానేస్తారేమో కానీ ఆఫర్ లో చీరలు ఉన్నాయంటే మాత్రం ఓ రేంజ్ లో ఎగబడిపోతదారు. ఇది ప్రతి ఒక్కరి ఇంటి కథే. చీరల కోసం మహిళలలు భర్తలతో పడే గొడవలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. నచ్చిన చీర కొనిపించకపోతే ఇక భర్తకు నరకమే. అలకతో ఇంటినంతా అల్లకల్లోలంగా మార్చేస్తారు మగువులు. బీరువా నిండా వందల చీరలు ఉన్నా కొత్త చీర కనిపిస్తే మాత్రం కాంచనలా మారిపోతారు. అందులోనూ ఆఫర్ లో అందమైన చీర వస్తుందంటే అంత ఈజీగా వదిలేసుకుంటారా.. తాజాగా ఇలాంటి ఓ ఘటనే బెంగళూరులో జరిగింది. డిస్కౌంట్ లో చీరులు అందుబాటులో ఉన్నాయని ఆఫర్ ను ప్రకటించగానే మహిళలు తండోపతండాలుగా వచ్చేశారు. మల్లేశ్వరం ప్రాంతంలో ఓ చీరల షాపు ఇయర్లీ శారీ సేల్ ను నిర్వహించింది.

    womens-saree-fight-womens-incident-at-bengaluru-two-womens-fight-for-saree-video-viral
    womens-saree-fight-womens-incident-at-bengaluru-two-womens-fight-for-saree-video-viral

    చీరలు చూసేందుకు అక్కడి ప్రాంతంలోని మహిళలు అందరూ తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంతగా మహిళలు షాపు మొత్తం నిండిపోయారు. అందరూ తమకు నచ్చిన చీరల వేటలో మునిగిపోగా ఓ ఇద్దరు మహిళలు మాత్రం సిగపట్లు పట్టారు. ఒకరిని ఒకరు కుమ్మేసుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ చుట్టుపక్కన ఉన్న జనాన్ని మరిచిపోయి ఒకరిని ఒకరు కొట్టుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఎంత మంది ఆపినా ఆగలేదు. ఓ పోలిసు, సెక్యూరిటీ గార్డు వస్తే కానీ మహిళల ముష్టి యుద్దాన్ని ఆపలేదు. ఈ సీనంతా అక్కడికి వచ్చిన మహిళలు తమ ఫోన్ లలో బంధించారు. ఆ నోట ఈ నోట చేసి నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. మహిళలు ఇద్దరూ పొట్టు పొట్టుగా కొట్టుకున్న వీడియో ను చూసి నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. చీరలంటే ఇష్టం ఉండాలి కానీ మరీ ఇంతలా కొట్టుకునేంద అవసరమా అంటూ హితవు పలుకుతున్నారు. అంతే కాదు డస్కౌంట్ ప్రకటించిన షాపు యజమానిపైన దుమ్మెత్తిపోస్తున్నారు.