Skin Allergy: చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో చర్మం పెద్ద ఎత్తున దెబ్బతింటుంది. చలికి చర్మం మొత్తం పొడి బారడం పగల్లు రావడం జరుగుతుంది. అలాగే కొంతమందిలో చర్మం మొత్తం దద్దుర్లు ఏర్పడితే ఉంటాయి. ఇలా ఎక్కువగా చలికాలంలో చర్మం దురద పెడుతుంది అంటే అది మనకు స్కిన్ ఎలర్జీ అని చెప్పాలి. ఇలా స్కిన్ అలర్జీతో భాధ పడేవారు వీటిపై ఎలాంటి ఆయింట్మెంట్స్ రాయకుండా కేవలం సహజ సిద్ధంగానే చిట్కాలతో వీటిని తొలగించుకోవచ్చు.
ఇలా చర్మంపై ఏర్పడినటువంటి దద్దుర్లు తొలగిపోవాలి. అంటే మనకు కొబ్బరినూనె కాకరకాయ చిటికెడు పసుపు అయితే చాలు ఈ మిశ్రమాన్ని రాయటం వల్ల తొందరగా ఈ స్కిన్ అలర్జీ నుంచి బయటపడవచ్చు. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇందులోకి అర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె చిటికెడు పసుపు వేసి ఈ మూడింటిని బాగా కలపాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనకు ఎక్కడైతే దద్దుర్లు ఉంటాయో ఆ ప్రాంతంలో చర్మం బాగా శుభ్రం చేసుకుని రాసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఈ అలర్జీ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక రాత్రిపూట ఈ మిశ్రమాన్ని కనుక దద్దుర్లపై రాస్తే ఆరిన తర్వాత పడుకుని తెల్లవారిన తర్వాత అయినా కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు ఇలా చేయటం వల్ల వెంటనే ఈ దద్దుర్లు సమస్య తగ్గుతుంది. ఇక చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండడం కోసం మన చర్మం ఎప్పుడు హైడ్రేట్ గా ఉండడానికి ఎక్కువగా నీటిని తీసుకోవాలి. అలాగే మాయిశ్చరైజర్లు కూడా ఉపయోగిస్తూ ఉండటం మంచిది.