Thulasi Plant: మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఆధ్యాత్మిక స్వరూపంగా భావిస్తాము. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ఇంటి ఆవరణలో తులసి మొక్క మనకు దర్శనమిస్తుంది ఇలా తులసి మొక్కను ప్రతిరోజు పూజించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. అయితే ఉన్నఫలంగా తులసి మొక్కలు పెద్ద ఎత్తున మార్పులు వస్తూ ఉంటాయి..ఇలా తులసి మొక్కలు మార్పులు రావడం దేనికి సంకేతం అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఈ విధంగా తులసి మొక్కలో పలుమార్పులు రావటం మొదలయ్యాయి అంటే మన ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని అర్థం కొన్నిసార్లు తులసి మొక్క ఆకులు మొత్తం వాడిపోయి రాలిపోతూ ఉంటాయి ఇలా ఉన్నఫలంగా జరిగితే మనకు ఏదో ఆర్థిక సమస్యలు రాబోతున్నాయని సంకేతం. అంతేకాకుండా తులసి మొక్క మొత్తం నల్లగా మాడిపోయి ఉంటుంది. ఇలా ఉన్నఫలంగా తులసి మొక్క మాడిపోతే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉందని సంకేతం.
ఇలా మన ఇంటి వాస్తు దోషాలు తులసి మొక్క రూపంలో బయటపడుతూ ఉంటాయి. అయితే తులసి మొక్కను ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజిస్తూ ఉండటం వల్ల ఈ వాస్తు దోషాలు మొత్తం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా తులసి మొక్కను మన ఇంటి ఆవరణంలో నాటేటప్పుడు సరైన దిశలో నాటడం ఎంతో ఉత్తమం తులసి మొక్క చుట్టూ ఏ విధమైనటువంటి ముళ్ళు కలిగినటువంటి మొక్కలు లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా తులసి మొక్క ఎప్పుడు కూడా తూర్పు దిశ వైపు ఉండేలా చూసుకోవాలి.