Relationship: భార్యాభర్తల మధ్య అన్యాన్య దాంపత్యం ఉండాలంటే కచ్చితంగా వారిద్దరి మధ్య శారీరక అనుబంధం బలంగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో ఎక్కువగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి ఆర్ధిక సంబంధమైన కారణాలు ఒకటైతే శారీరక సంబంధమైన కోరికలు కూడా కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరికీ కూడా శారీరక సంబంధ కోరికలు సహజంగా ఉంటాయి. అయితే మగవాళ్ళు ఆడవాళ్ళతో పడకసుఖం సరిగా పంచుకోకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా పెరగడానికి ఇవే కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మగవారి కంటే ఎక్కువగా స్త్రీలలో శారీరక కోరికలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే ఒక వయస్సు దాటిన తర్వాత ఇంకా శృంగార కోరికలు వారిలో ఎక్కువగా ఉంటాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు భాగా అలసిపోయి వచ్చిన పురుషుడు మరల రాత్రి వేళలో భార్యతో శారీరకంగా కలిసేందుకు ఆసక్తి చూపించడు. భాగా అలసిపోవడం వలన నిద్రపోతాడు. అయితే ఇలా శారీరక సుఖం విషయంలో భార్యలని నిర్లక్ష్యం చేసే పురుషులు చాలా మంది ఉంటారు. యుక్త వయస్సులో ఉన్న శారీరక కోరికలు మధ్యవయస్సులో ఉండతకపోవడం కూడా ఒక కారణం అని చెప్పాలి. అలాగేకొంతమంది జీవితాలలో భర్త శారీరక సుఖాలు తీర్చడానికి భార్య అంత ఆసక్తి చూపించదు. దీనికి చాలా కారణాలు ఉంటాయి.
ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అయితే దీనికి ఒక పరిష్కారం ఉంది. రాత్రి నిద్రపోయే సమయంలో శారీరకంగా శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బంది పడే పురుషులు ఉదయాన్నే వేకువ జామున శారీరకంగా కలిసే ప్రయత్నం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వలన పురుషులలో టెస్టో స్టిరాన్ హార్మోన్ సహజంగా అధికంగా రిలీజ్ అవుతుంది. ఆ సమయంలో స్త్రీలలో కూడా భావప్రాప్తి అధికంగా ఉంటుంది. ఇలా చేయడం వలన ఆ రోజంతా ఇద్దరు ఉత్సాహంగా ఉండటంతో పాటు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.