Ratha saptami: మన హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి పండుగ వెనుక ఎన్నో పురాణాలు ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే హిందువులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో వచ్చే సప్తమిని రథసప్తమిక జరుపుకుంటారు. ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సూర్యదేవాలయాలలో రథసప్తమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని సూర్య భగవానుడికి పూజలు చేస్తారు అంతేకాకుండా రథసప్తమి రోజు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలపై ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. జిల్లేడు ఆకులను అర్క పత్రాలు అని కూడా పిలుస్తారు. సూర్య భగవానుడికి అర్క అనే పేరు ఉండటం వల్ల ఈ జిల్లేడు ఆకులను రథసప్తమి రోజు పెట్టుకొని స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి స్నానం అనంతరం ఒక చెంబులో జిల్లేడు ఆకులు నల్లని నువ్వులు వేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి.
ఈ విధంగా సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఓం నమో సూర్య దేవాయ నమః అనే మంత్రాన్ని చదువుకొని ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఇక జిల్లేడు చెట్టులో సాక్షాత్తు వినాయకుడు ఉంటారని భావిస్తూ ఉంటారు. అందుకే ఈ జిల్లెడు పత్రాలను తలపై పెట్టుకున్న స్నానం చేయటం వల్ల పిల్లలలో విద్యాబుద్ధులు కూడా ఉంటాయని పండితులు చెబుతుంటారు. ఇక రథసప్తమి రోజు పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేయడం ఉపవాసాలు ఉండటం ఎంతో మంచిది.