Brush: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేస్తూ ఉంటాము. ఇలా ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయటం వల్ల నోరు దుర్వాసన రాకుండా ఉండటమే కాకుండా దంతాల ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేయటం చాలా మంచిదని దంత నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఉదయం నిద్ర లేవగానే మొదట చేసే పని బ్రష్ చేయడం ఇలా ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేయడం చాలా మంచి అలవాటని భావిస్తూ ఉంటారు.
అయితే ఉదయం నిద్ర లేవగానే ఇలా బ్రష్ చేయటం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను కోల్పోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన లాజలంలో విడుదలయ్యే బి-12 విటమిన్ మనం కోల్పోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మనం రాత్రి నిద్రపోతున్న సమయంలో మన లాలాజలంలో విటమిన్ B12 ఉంటుంది. ఈ విటమిన్ మన శరీరం ఉత్పత్తి చేయదు కనుక దీనిని ఆహార రూపంలో లేదా సప్లమెంటరీ రూపంలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇక మన శరీరం ఈ విటమిన్ ని కనుక కోల్పోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా రక్తప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా సిరలలో రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి వేరికోస్ వైన్స్ ఏర్పడటం లేదంటే కాళ్లు మంటలు లాగడం వంటి సమస్యలు వస్తుంటాయి అందుకే ఈ లాలాజలంలో ఉత్పత్తి అయ్యే ఈ విటమిన్ పొందడం కోసం మనం నిద్రలేవగానే బ్రష్ చేయకుండా ఒక గ్లాస్ నీటిని తాగటం వల్ల ఆ విటమిన్ బి 12 ప్రేగులలోకి వెళ్లడంతో చిన్నప్రేగు సోషించుకుంటుంది తద్వారా మన శరీరానికి బి 12 విటమిన్ అందుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ చేయడానికి అంటే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం ఎంతో మంచిది.