Lord Hanuma: మనం ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్తే అక్కడ స్వామివారికి సింధూరం పూసి పూజ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆలయంలో మనకు సింధూరం బొట్టుగా ఇస్తారు. ఇక హనుమాన్ మాల ధరించే వారు కూడా సింధూరం రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరిస్తూ ఉంటారు ఇలా ఆంజనేయస్వామిని సింధూరంతో ఎందుకు అంత ప్రత్యేకంగా పూజిస్తారు. అసలు ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం అనే విషయానికి వస్తే..
ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజించడం వెనుక పెద్ద పురాణ గాధ ఉందని తెలుస్తుంది. ఓసారి సీతాదేవి నుదుటిన సింధూరం పెట్టుకుంటూ ఉండగా అది గమనించిన ఆంజనేయస్వామి అమ్మ మీ నుదుటిన పెట్టుకుంటున్నది ఏది ఎందుకు దానిని అలా పెట్టుకుంటున్నారు అంటూ ప్రశ్నించారట ఈ ప్రశ్నలకు సీతాదేవి సమాధానం చెబుతూ ఇలా నేను నుదుటిన సింధూరం పెట్టుకోవడం శ్రీరాముడిని సంతోషపరుస్తుంది. సంపన్నమైన దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. సకల ఐశ్వర్యాలను కలిగిస్తుందని వాయు పుత్రుడికి సీతమ్మ చెబుతుంది.
ఈ మాటలు విన్నటువంటి ఆంజనేయస్వామి అక్కడే నుంచి మాయమైపోయి కొద్దిసేపటి తర్వాత తన శరీరం మొత్తం ఎర్రటి సింధూరని పూసుకొని తిరిగి రాముడి వద్దకు వస్తారట అది చూస్తున్న రామ ఒక్కసారిగా ఆశ్చర్యపోగా ఏంటి హనుమ ఇలా చేశావు అనడంతో సింధూరం మిమ్మల్ని సంతోష పరుస్తుందని దీర్ఘాయుని కలిగిస్తుందని సీతాదేవి చెప్పిన మాటలను చెప్పడంతో శ్రీరాముడు ఒక వరం ఇచ్చాడు ఎవరైతే హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయని దీర్ఘాయువు ఉంటుందంటూ వరం ఇవ్వడం చేత ఆంజనేయ స్వామిని పూజించాలి అంటే తప్పనిసరిగా సింధూరంతోనే పూజించడం ఆనవాయితీగా వస్తోంది.