Spiritual: గ్రామ దేవతలు ఎవరు… ఆ పేర్లు ఎలా వచ్చాయంటే?

Spiritual: పురాతనకాలంలో ప్రజలు అందరూ గ్రామీణ ప్రాంతాలలో జీవనం సాగించేవారు. కొన్ని కుటుంబాలు కలిసి ఒక చోట వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఆవాసాలు వేసుకొని జీవించే వారు. అలా ఆయా కుటుంబాలు వారసత్వం పెరిగి, ఇంటి పేర్లు మార్చుకొని వందలాది కుటుంబాల సమూహంగా మారాయి. అలాగే పల్లెటూళ్ళు, గ్రామాలు మన జీవన విధానంలో భాగం అయ్యాయి. ఇప్పుడంటే జీవన విధానాలలో మార్పుల కారణంగా పట్టణాలు పెరిగాయి కాని 20 ఏళ్ళ క్రితం వరకు గ్రామాల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. ప్రజలు కూడా కుటుంబంతో కలిసి సొంత ఊరిలోనే ఏదో వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటూ, కుల వృత్తులపై బ్రతుకుంటూ జీవించే వారు.

అయితే సంపాదన పై ద్యాస పెరిగిన తర్వాత ఉద్యోగాల కోసం, అధిక సంపాదన కోసం పట్టణాలకి వలస వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. ఇక గ్రామాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేవి గ్రామ దేవతల పండగలు. ప్రతి ఏడాది ఈ గ్రామ దేవత పండగలు జరుపుకుంటూ ఉంటారు. ఆ పండుగల సమయంలో గ్రామంలోని అందరూ అమ్మవారికి పసుపు, కుంకుమలు ఇవ్వడం, అలాగే పశువులని, జంతువులని బలిఇచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం చేస్తూ ఉంటారు. ఇప్పటికి ఈ ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామంలోని నమ్ముకున్న ప్రజలని రక్షిస్తూ, వారు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా, అలాగే వారి పంటలు బాగా పండేలా గ్రామదేవతలు రక్షణగా ఉంటారని ప్రజల నమ్మకం. అలాగే భూత, ప్రేతల నుంచి పొలిమేరలో ఉంటూ తనని నమ్ముకున్న వారికి అమ్మవారు కాపలా కాస్తూ ఉంటుందని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. అయితే చాలా ప్రాంతాలలో గ్రామ దేవతలకి రూపాలు ఉండవు. చెట్టుగానో, పుట్టగానో, లేదంటే రాయిగానో పూజిస్తారు. అలాగే కొన్ని చోట్ల అయితే ఎలాంటి ఆనవాళ్ళు లేకపోయిన గ్రామదేవతని అక్కడ కొలుస్తూ ఉంటారు. హిందువులు దేవతలని ప్రత్యేక రూపాలలో పూజిస్తూ ఉంటారు. కాని గ్రామ దేవతలకి మాత్రం అలా రూపాలు లేకపోవడానికి కారణం ఉంది.

భారతీయ మూలవాసులకి శివ, కేశవులు తెలికముందే ప్రకృతిని, పంచభూతాలని ఆరాధించేవారు. ప్రకృతిలో ఉన్న గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశాన్ని శక్తి స్వరూపిణిగా భావిస్తూ రూపం లేకుండానే ఆరాధించేవారు. ఎవరో ఒకరి కలలో శక్తి స్వరూపిణి అదృశ్య రూపంగా కనిపించి తన ఆనవాళ్ళు చెప్పేది అని, ఆ ఆనవాళ్ళు ఆధారంగా గ్రామంలోని ప్రజలందరూ అమ్మవారు పలానా ప్రాంతంలో కొలువై ఉంది అని భావించి అక్కడ గుడి కట్టి పూజలు చేయడం చేసే వారు. అలాగే వేపచెట్టు, మర్రిచెట్టుని కూడా గ్రామదేవత రూపాలుగా భావించి ఆరాధించే వారు. ఇప్పటికి ఎవరికైనా ఆటలమ్మ డిసీజ్ వస్తే అమ్మవారు పట్టింది అని భావించి వేపచెట్టు ఆకులని వారిపై ఉంచి అమ్మవారిని శాంతింప జేస్తారు నూకాలమ్మ, పైడమ్మ, మావూళ్ళమ్మ, అంకాలమ్మ, పొలమ్మ, కుంకుళ్ళమ్మ, గోగులమ్మ, కామాక్షమ్మ, ఎల్లమ్మ, మెరక తల్లి, పైడితల్లమ్మ, తలుపులమ్మ, దేవుల్లమ్మ, పరదేసమ్మ, గంగమ్మ, బతుకమ్మ అనే రకరకాల పేర్లతో గ్రామ దేవతలని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కొలుస్తూ ఉంటారు.

ఈ పేర్లు అన్ని కూడా అమ్మవారు వెలిసిన ప్రాంతం బట్టి వారికి ఆయాగ్రామల ప్రజలు పెట్టుకున్నవే. అయితే భారతీయ వైదిక సనాతన ధర్మాలలో ఈ గ్రామ దేవతల ప్రస్తావన ఎక్కడా కూడా ఉండదు. దీనికి కారణం అగ్ర కులాల వారు శుద్ర కులాల వారిని వైదిక దేవతలకి దూరం చేస్తే వారు తమకంటూ ప్రత్యేకంగా ప్రకృతిని దేవతా శక్తిగా భావించి గ్రామీణ దేవతలని ప్రతిష్టించుకొని ఆరాధించడం మొదలు పెట్టారు. కాలక్రమంలో ఈ గ్రామదేవతలని పూజించే వారు ఎక్కువ కావడంతో వారిని వైదిక శాస్త్రాలలో కలిపేసి శక్తి స్వరూపిణిగా గ్రామదేవతలని మార్చేశారని చాలా మంది చెబుతూ ఉంటారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.