Wed. Jan 21st, 2026

    Pawan Kalyan : మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ల కంటే కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. ఆయన సినిమా అంటే పూనకాలొచ్చి ఊగిపోయేవారెందరో ఉన్నారు. దేశ విదేశాలలో పవన్ కళ్యాణ్‌కి అభిమానులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నారంటే పవన్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    when-pawan-kalyan-movies-released
    when-pawan-kalyan-movies-released

    ఇంత అసాధారణమైన క్రేజ్ సాధించిన పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా అయితే అందరూ ఎంతో హ్యాపీ. కానీ, ఆయన జనాలకి ఏదో చేయాలనే తపనతో జనసేన పార్టీని నెలకొల్పారు. ఈ కారణంగా ఆయన గతంలో కొన్నేళ్ళ పాటు సినిమాలను వద్దనుకున్నారు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల కోసం సినీ జీవితాన్ని వదులుకోవడానికి సిద్దమయ్యారు. కానీ, అది పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, మెగా ఫ్యాన్స్ కూడా సహించలేకపోయారు..భరించలేకపోయారు.

    Pawan Kalyan : అనుకున్నదే చేసే రకం.

    కనిపించిన ప్రతీసారి ఆయనని సినిమాలు చేల్సిందేనంటూ పట్టుపట్టారు. దాంతో ఆయన మళ్ళీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానని ఒక్క మాట అనాలే గానీ..పెద్ద పెద్ద నిర్మాతలు కూడా రెడీ అవుతారు. అలా వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలని ప్రకటించారు. వాటిలో పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు లాంటి భారీ ప్రాజెక్ట్ కూడా ఉంది.

    Pawan Kalyan OG
    Pawan Kalyan OG

    కానీ, ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఆయనకే తెలీదు. వకీల్ సాబ్ సినిమా సమయంలో పవన్ కమిటైన సినిమాలన్నీ ఈ పాటికే రిలీజ్ కావాల్సింది. కానీ, ఆయనకున్న రాజకీయ బిజీ వల్ల సినిమాలు ఆగిపోతున్నాయి. దాంతో అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు..షూటింగ్ మొదలు పెట్టిన మేకర్స్ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ, తప్పడం లేదు. అభిమానుల కోసం సినిమాలు..జనాల కోసం రాజకీయాలు..ఇలా రెండు పడవల ప్రయాణం వల్ల రెండిటికీ సరిగ్గా న్యాయం చేయడం లేదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఆయన మాత్రం అనుకున్నదే చేసే రకం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొత్తగా సినిమాలు కమిటైనా అది ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో తేలని పరిస్థితి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.