Bhogi Festival: సంక్రాంతి పండుగ అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తమ సొంత గ్రామాలకు చేరుకుంటారు ముఖ్యంగా తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడా పుట్టింటికి వెళ్లి మూడు రోజులపాటు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగను కన్నుల పండుగగా చేసుకుంటారు. ఆడబిడ్డలు అల్లుళ్ళ రాకతో ఇల్లు మొత్తం కలకలలాడిపోతుంది భోగి మకర సంక్రాంతి కనుమ ఇలా మూడు రోజులపాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.భోగి పండుగ జనవరి 14వ తేదీ ఆదివారం జరుపుకోబోతున్నారు.
భోగి, సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు హరిదాసు గీతాలు గంగిరెద్దు నాట్యాలు కోడిపందాలు, బొమ్మల కొలువు, భోగి మంటలు వంటి వాటి ద్వారా ఈ పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే ఇక మూడు రోజులలో మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి అసలు భోగి పండుగను ఎలా జరుపుకుంటారు ఈ ఏడాది భోగి పండుగ ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వస్తే..భగ అనే పదం నుంచి భోగి పుట్టింది. దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు.
భోగి పండుగ రోజు సూర్యోదయాన్ని కంటే ముందుగా నిద్ర లేచి తలంటూ స్నానాలు చేసి కొత్త బట్టలను ధరించి ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గుపై భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి మంటలలో భాగంగా పిడకలు అలాగే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను కాల్చివేస్తారు. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులతో పాటు మనం పడ్డ కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటలలో కాలిపోయి సంతోషం రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ భోగిమంటలు వేస్తారు అదేవిధంగా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్ళను పోయడం వల్ల సర్వరోగాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.