Technology: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత అన్ని రకాల సేవలు మనకి చేరువ అయిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పౌరసంబంధ సమాచారం మరింత చేరువ చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. రకరకాల యాప్స్ ని ప్రభుత్వ సేవల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మరింత అడ్వాన్స్ గా ఉంటుంది. డిజిటల్ బ్యాకింగ్ సర్వీస్ లో భాగంగా భీమ్ యాప్ ని, అలాగే ఆధార్ కోసం, ఇతర ప్రభుత్వ సంబంధ సేవల కోసం యాప్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే ప్రభుత్వ సంబంధిత డాక్యుమెంట్ సేవల కోసం కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అనే యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్టేషన్ పత్రాలు, రేషన్ కార్డు, 10, ఇంటర్ మార్క్స్ డాక్యుమెంట్స్ కూడా అందిస్తుంది. అలాగే ప్రభుత్వంతో సంబంధం ఉన్న అన్ని పౌర సంబంధ డాక్యుమెంట్స్ ని కూడా డిజిలాకర్ యాప్ ద్వారా ప్రజలకి అందిస్తుంది. ఈ యాప్ ని ఇప్పటికే దేశంలో మిలియన్స్ లో ప్రజలు ఉపయోగిస్తున్నారు.
అయితే ఇప్పుడు మరో సరికొత్తగా డిజిలాకర్ సౌకర్యాన్ని ప్రజలకి చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. అందులో భాగంగా వాట్సాప్ ద్వారానే డిజిలాకర్ లో లభించే అన్ని రకాల డాక్యుమెంట్స్ ని నేరుగా మన వాట్సాప్ ద్వారా ఫోన్ లోనే డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. దీనికోసం ఒక వాట్సాప్ నెంబర్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌లో 9013151515 నెంబర్ ద్వారా ప్రజలు డిజిలాకర్ లో అందుబాటులో ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్స్ ని పొందవచ్చు.
వాట్సప్‌లో మై గవ్ హెల్ప్ డెస్క్ ద్వారా ఈ సర్వీస్ ప్రజలకి వినియోగంలో ఉంటుంది. వాట్సప్ నంబరుకు నమస్తే, హాయ్, డిజిలాకర్ అన్న పదాల్లో ఒక దాన్ని టైప్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబరు పంపమని మెసేజ్ వస్తుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. దాని ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ చేసుకున్నట్లయితే తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్ కావాలంటే దాని నెంబర్ఎంటర్ చేస్తే అది ఫోన్ లోకి నేరుగా డౌన్ లోడ్ అవుతుంది. ఈ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇక మీరు కూడా డిజిలాకర్ సేవలని వాట్సాప్ ద్వారా పొందండి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.